pizza
Right Right release on 10 June
జూన్ 10న `రైట్ రైట్` విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

23 May 2016
Hyderaba
d

వ‌రుస విజ‌యాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్న క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన తాజా చిత్రం `రైట్ రైట్‌`. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న `ఆర్డిన‌రీ` చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు సమర్పణలో మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న‌ పూజా జవేరి నాయిక‌గా న‌టించారు. బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర పోషించారు. జూన్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - "నేనిప్పటివరకూ చేసిన అన్ని పాత్రలకూ పూర్తి భిన్నమైన పాత్రను ఈ చిత్రంలో చేశాను. నా పాత్ర చాలా న్యాచురల్ గా ఉంటుంది. లక్ష్యం కోసం తప్పించే ఓ యువకుడి కథ ఇది. అయితే ఆ కుర్రాడు చివరికి బస్ కండక్టర్ అవుతాడు. ఆ బస్సులో అతనికి ఓ మిస్ తారసడుతుంది. ఆ మిస్ తో ఈ బస్ కండక్టర్ కి ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? అనేది కథ. ఈ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ, చేశాను. ఫస్టాఫ్ వినోద ప్రధానంగా, సెకండాఫ్ మిస్టరీగా ఉంటుంది'' అని చెప్పారు.

నిర్మాత జె. వంశీకృష్ణ మాట్లాడుతూ - "అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి. జూన్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఎస్‌.కోట నుంచి గ‌విటికి వెళ్లే ఓ ఆర్టీసీ బ‌స్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, ల‌వ్‌, మిస్ట‌రీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. సమంత్ అశ్విన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుంది. సుమంత్ అశ్విన్ కెరీర్ లోనే హయ్యస్ట్ ప్రింట్లతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. 'బాహుబలి' ఫేమ్ ప్రభాకర్ చేసిన పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. అన్ని వర్గాలవారూ చూడదగ్గ మంచి చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని తెలిపారు.

.నాజ‌ర్‌, ధ‌న‌రాజ్‌, `ష‌క‌ల‌క` శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జీవా, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌త్‌రెడ్డి, వినోద్‌, పావ‌ని, క‌రుణ‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాట‌లు: శ్రీమ‌ణి, కెమెరా: శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌, మాట‌లు: `డార్లింగ్‌` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్‌.రాజీవ్‌, కో ప్రొడ్యూస‌ర్‌: జె.శ్రీనివాస‌రాజు, నిర్మాత‌: జె.వంశీకృష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ను, స‌మ‌ర్ప‌ణ‌: వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved