pizza
RPA Creations - Sunil film first schedule completed
You are at idlebrain.com > news today >
Follow Us

26 August 2015
Hyderabad

మెద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ - సునిల్ చిత్రం

న‌టుడుగా ఎన్నో వైవిద్య‌మైన పాత్ర‌ల‌తో న‌వ్వించి, హీరోగా సూప‌ర్ స‌క్సస్ లు సాధించిన సునీల్ క‌థానాయ‌కుడిగా, ర‌క్ష లాంటి టెర్రిఫిక్ క‌థాంశంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ ద‌ర్శ‌కుడిగా, చిన్నచిత్రాల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిల‌వ‌ట‌మే కాకుండా కొత్త జాన‌ర్ ని తెలుగు సినిమా ఇండ‌స్ట్రికి ప‌రిచ‌యం చేసిన ప్రేమ‌క‌థా చిత్రమ్ సినిమాతో ఉత్త‌మాభిరుచి వున్న నిర్మాతగా ప్ర‌శంశ‌లు అందుకున్న నిర్మాత‌ ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-2 గా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుని మెద‌టి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. హీరో సునిల్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్‌ మ‌న్నార్ చోప్రా న‌టిస్తుంది. హీరో, హీరోయిన్ తో పాటు రాజార‌వింద్ర‌, ప్ర‌భాస్ శీను, అదుర్స్ ర‌ఘు, ఇంకా కొంత‌మంది న‌టీన‌టుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు. త‌దుప‌రి షెడ్యూల్ సెప్టెంబ‌ర్ రెండ‌వ వారం నుండి దాదాపు నెల రోజులు వైజాగ్ లో జ‌రుపుకుంటుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. హ‌ర‌ర్ కామెడి అనే కొత్త జాన‌ర్ తో నిర్మించిన‌ ప్రేమ‌క‌థా చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాందించిందో అంద‌రికి తెలిసిందే. ఆ చిత్రంతోనే మా బ్యాన‌ర్ ఆర్‌.పి.ఏ.క్రియేష‌న్స్ స్టార్ట‌యింది. అంతేకాదు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో మా బ్యాన‌ర్ ఎంత‌లా పాతుకుపోయిందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి బ్యాన‌ర్ లో ప్రోడక్ష‌న్ నెం-2 గా ఓ చిత్రం వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాల‌తో వుంటారు. ఇప్పుడు ర‌క్ష చిత్ర ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ, హీరో సునీల్ కాంబినేష‌న్ లో చిత్రాన్ని చేస్తున్నాము. ఎటువంటి ఆటంకం లేకుండా విజ‌య‌వంతంగా మెద‌టి షెడ్యూల్ ని హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తిచేసాము. ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ మన్నార్ చోప్రా హీరోయిన్ గా న‌టిస్తుంది.ఆద్యంతం ఎంతో ఆశ‌క్తిగా ఉత్కంఠ భ‌రితంగా, ఉహించ‌ని మలుపుల‌తో, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ని మించి కామెడి తో ఈ చిత్రం క‌థ వుంటుంది. ద‌ర్శ‌కుడి వంశి క‌మిట్‌మెంట్‌, క్లారిటి చూస్తే మా యూనిట్ అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగింది. ఏం చెప్పాడో అలానే చిత్రాన్ని త‌న షెడ్యూల్ ప్ర‌కారం సూప‌ర్బ్ ఫ్రేమింగ్ తో చేస్తున్నాడు. వంశి ఫ్యూచర్లో పెద్ద ద‌ర్శకుల లిస్ట్ లో వుంటాడ‌న‌టంలో అనుమాన‌మే లేదు. బ్యాన‌ర్ లో ద్వారా స్టార్ క‌మెడియ‌న్ అయిన స‌ప్త‌గిరి ఎప్పుడు చెయ్య‌ని ఓ వైవిధ్య‌మైన కామెడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అంతేకాదు ధియోట‌ర్ కి వ‌చ్చిన ప్రేక్ష‌కున్ని క‌డుపుబ్బ న‌వ్విస్తాడు. త‌దుపరి షెడ్యూల్ ని సెప్టెంబ‌ర్ రెండ‌వ వారంలో వైజాగ్ లో చేయ‌నున్నాము. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్నిఅల‌రిస్తుంది అని అన్నారు

ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ మాట్లాడుతూ.. హీరో సునీల్ గారితో నాకు ఇంత‌కు ముందే ప‌రిచ‌యముంది. చాలా మంచి స్నేహితుడు కూడా మంచి క‌థ తీసుకురా సినిమా చేద్దాం అన‌ట‌మే కాదు ఇప్పుడు చేస్తున్నారు. సునీల్ గారిని ఏలా చూస్తే ప్రేక్ష‌కులు ఆనందిస్తారో దాన్ని మించి సూప‌ర్బ్ గా చూపించ‌బోతున్నాం. ర‌క్ష చిత్రం త‌రువాత నేను క‌మ‌ర్షియ‌ల్ చిత్రం చేయాల‌ని ఈ క‌థ‌ని రాశాను. సినిమా ల ప‌ట్ల మంచి ప్యాష‌న్ విలువ వున్న నిర్మాత ఆర్‌. సుద‌ర్శ‌న్ రెడ్డి గారితో ఈచిత్రం చేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం లో సునీల్ గారు కామెడి టైమింగ్ మిస్ కాకుండా యాక్ష‌న్ చేస్తారు. అంతే కాకుండా ఊహించ‌ని మ‌లుపుల‌తో కోత్త‌గా వుంటుంది. స‌ప్త‌గిరి ఈ చిత్రంలో ఫుల్‌ప్లెడ్జ్‌డ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. స‌ప్త‌గిరి కామెడి త‌న గ‌త చిత్రాల‌ను మించి వుండ‌బోతుంది. హీరో సునీల్ స‌రస‌న బాలీవుడ్ హీరోయిన్ మ‌న్నార్ చోప్రా న‌టిస్తుంది. అనుకున్న విధంగానే విజ‌య‌వంతంగా మెద‌టి షెడ్యూల్ ని హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తిచేశాము. త‌దుప‌రి షెడ్యూల్ ని సెప్టెంబ‌ర్ రెండ‌వ వారం నుండి విజ‌య‌వంతంగా వైజాగ్ లో చేయ‌నున్నాము. దాదాపు టాకీ అంతా అక్క‌డే పూర్తిచేస్తాము. సునీల్ గారి అభిమానుల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కులంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.. అని అన్నారు..

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో సునీల్‌, మ‌న్నార్ చోప్రా(ప‌రిచ‌యం), క‌భీర్ సింగ్‌(జిల్ ఫేమ్‌), గొల్ల‌పూడి మారుతిరావు, సప్త‌గిరి , నాగినీడు,స‌త్య‌ప్ర‌కాష్‌,, ప్ర‌దీప్ రావ‌త్‌, రాజార‌వీంద్ర‌, అదుర్స్ ర‌ఘు, ఉద‌య్‌, ప్ర‌బాస్ శీను త‌దిత‌రులు న‌టిస్తుండ‌గా..

సంగీతం:ధినేష్‌, ఆర్ట్ : మ‌ర‌ళిధ‌ర్‌, కెమెరా: సి.రామ్ ప్ర‌సాద్‌, ఎడిట‌ర్ :ఎమ్.ఆర్‌.వ‌ర్మ‌, కో-డైర‌క్ట‌ర్స్ : రామ‌చంద్రరావు, శివాంజ‌నేయులు, కాస్ట్యూమ్స్: మ‌స్తాన్‌, పి.ఆర్‌.వో: ఏలూరు శ్రీను
స‌హ‌-నిర్మాత‌లు: మాస్ట‌ర్ ఆర్‌.ఆయుష్ రెడ్డి, ఆర్‌.పి.అక్షిత్ రెడ్డి,
నిర్మాత‌.:ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి, క‌థ‌-స్కీన్‌ప్లే -ద‌ర్శ‌కత్వం :వంశి కృష్ణ ఆకేళ్ళ‌


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved