రుక్షార్ కన్నడ నుంచి తెలుగుకు వచ్చిన నటి. తెలుగులో షో టైమ్ ఆమె తొలి చిత్రం. ఆకతాయిలో నాయికగా నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రుక్షార్ ఆదివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు...
* మీ గురించి చెప్పండి?
- నేను పుట్టింది లండన్‌లో. మా నాన్న బిజినెస్ కోసం గోవాకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ కొన్నాళ్లు చదివాను. ఆ తర్వాత బెంగుళూరుకు మకాం మార్చాం. అక్కడ రెండు కన్నడ చిత్రాల్లో చేశాను. తెలుగులో షో టైమ్‌లో నటించాను. కానీ ముందు ఆకతాయి విడుదలవుతోంది.
* ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- అనక అనే పాత్రలో నటించాను. నా వయసుకు తగ్గట్టు బబ్లీగా ఉంటుంది. చూసేవాళ్లందరికీ తప్పకుండా నచ్చుతుంది.
Rukshar Mir interviewgallery
* మీరు యాక్షన్ ఏమైనా చేశారా?
- కన్నడలో నా రెండు చిత్రాల్లో కాస్త అది కనిపిస్తుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లో హీరో పక్కన ఉన్నానేకానీ నేనేం యాక్షన్ చేయలేదు.
* తెలుగులో ఇంకేమైనా సినిమాలున్నాయా?
- కన్నడలో ఒకటి చేస్తున్నాను. తెలుగులో కథలు వింటున్నాను.
* టీమ్ గురించి చెప్పండి?
- మంచి టీమ్ కుదిరింది. చాలా బాగా చేశాం. ప్రేక్షకుల రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం.