pizza
Rumors about Venky Mama shelved are false
వెంకీ మామ గురించి వ‌స్తోన్న వార్త‌ల్లో వాస్త‌వం లేదు..!
You are at idlebrain.com > news today >
Follow Us

25 October 2018
Hyderabad

Much anticipated Venkatesh and Naga Chaitanya’s multi starrer #VenkyMama under the direction of Bobby regular shooting to begin soon. People Media Factory, Suresh Productions and Kona Film Corporation are jointly producing this film.

Latest update Venky Mama will go on floors in November second week. Naga Chaitanya will join the shooting accordingly. The rumors on film shelved are completely false. This multi starrer is being made with an interesting subject and definitely will be an eye feast to Akkineni and Daggubati fans.

వెంకీ మామ గురించి వ‌స్తోన్న వార్త‌ల్లో వాస్త‌వం లేదు..!

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో ఓ సినిమా రానుంద‌ని..ఈ చిత్రానికి టైటిల్ వెంకీ మామ అని తెలిసిన‌ప్ప‌టి నుంచి అటు వెంకీ అభిమానులు ఇటు నాగ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెర పై చూస్తామా అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ కి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అయితే..ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది కానీ...ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాక‌పోవ‌డంతో వెంకీ మామ ఆగిపోయింది అనే ప్ర‌చారం మొద‌లైంది. అస‌లు విష‌యం ఏంటంటే...వెంక‌టేష్ ప్ర‌స్తుతం ఎఫ్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు. నాగ‌చైత‌న్య ఓ వైపు స‌వ్య‌సాచి ప్ర‌మోష‌న్స్, మ‌రో వైపు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న వెంకీ మామా ఇంకా స్టార్ట్ కాలేదు. అంతే కానీ..ప్ర‌చారంలో ఉన్న‌ట్టు ఈ సినిమా ఆగిపోలేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం... న‌వంబ‌ర్ సెకండ్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. నాగ చైత‌న్య న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడ‌ని తెలిసింది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానుల‌కు ఓ పండ‌గ అని చెప్ప‌చ్చు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved