pizza
Sai Korrapati donates 25 lacs to AP Capital construction from the proceedings of Baahubali benefit shows
You are at idlebrain.com > news today >
Follow Us

10 July 2015
Hyderabad

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో సాయికొర్రపాటి ముందడుగు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో వారాహి చలనచిత్రం భాగం కావాలనుకుని కృష్ణాజిల్లాలో ‘బాహుబలి’ బెనిఫిట్ షోను ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి అందజేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నిర్వహించిన ఈ బెనిఫిట్ షోస్ ద్వారా 24, 24, 999 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి ఆంధ్రప్రదేశ్ నూతన నిర్మాణ రాజధానికి విరాళంగా అందజేయనున్నారు. ఎన్నో ఉత్తమ చిత్రమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సాయికొర్రపాటి సినిమా రంగంతో పాటు, సేవారంగంలోనూ ముందుంటున్నారు. గతంలో హుదూద్ బాధితులకు ఆర్ధిక సహాయంతో పాటు వంద టన్నుల బియ్యం కూడా అందించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుని సహృదయతను చాటుకున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved