pizza
Sairam Challa about Control-C
థ్రిల్లింగ్ కామెడీతో `కంట్రోల్ సి`
You are at idlebrain.com > news today >
Follow Us

16 June 2016
Hyderaba
d

కంట్రోల్ సి సినిమా ఈ నెల 17న విడుద‌ల కానుంది. అశోక్‌, దిశాపాండే జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. సెకండ్ ఇండిపెండ‌న్స్ టాకీస్ ప‌తాకంపై ఈ సినిమా తెర‌కెక్కింది. సాయిరామ్ చ‌ల్లా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌భాక‌ర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా గురించి

చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నేను రెండు ద‌శాబ్దాలు సాఫ్ట్ వేర్‌గా ప‌నిచేశాను. సినిమాల మీద ఉన్న ఆస‌క్తితో ఈ రంగంలోకి వ‌చ్చాను. సుకుమార్ నాకు ఆర్య స‌మ‌యం నుంచి తెలుసు. ఆయ‌న నాకు ద‌ర్శ‌కుడిగా చాలా స్ఫూర్తి పొందాను. ద‌ర్శ‌కుడిని బాగా ఎంక‌రేజ్ చేసే ర‌కం ఆయ‌న‌. నేను ఈ సినిమా క‌థ చెప్ప‌గానే న‌చ్చ‌డంతో ప్రొసీడ్ అవ‌మ‌న్నారు. ఇందులో హీరోతో నాకు 12ఏళ్లుగా తెలుసు. చాలా బాగా చేశాడు. ట్విన్‌ట‌వ‌ర్స్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ జంట‌కు ఓ టేప్ దొరుకుతుంది. దాంతో వారు ఇండియాకు వ‌చ్చి ఓ కంపెనీలో జాయిన్ అవుతారు. ఆ టేప్‌కి, వారికీ, ఆ కంపెనీకి సంబంధం ఏంట‌న్న‌ది క‌థ‌. పృథ్వి, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హేమ బాగా న‌వ్విస్తారు. థ్రిల్లింగ్ కామెడీతో సాగుతుంది. రెండు పాట‌లుంటాయి. ఐట‌మ్ సాంగ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. సుకుమార్‌కి నేను ఏక‌ల‌వ్య శిష్యుడిని. ఈ సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. శుక్రవారం 70 స్క్రీన్లుల్లో చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. ఇందులో హీరో, హీరోయిన్లు అని ఎవ‌రూ ఉండ‌రు. అంద‌రూ మెయిన్ లీడ్స్ ఉంటారు. మా చిత్ర నాయిక 12 సినిమాల్లో న‌టించింది. అందులో ఎక్కువ‌గా క‌న్న‌డ చిత్రాలే ఉన్నాయి`` అని చెప్పారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved