pizza
Samantha releases Love Story song
''లవ్ స్టోరి'' చిత్రంలో 'సారంగ దరియా' పాట రిలీజ్ చేసిన స్టార్ హీరోయిన్ సమంత
You are at idlebrain.com > news today >
 
Follow Us

28 February -2021
Hyderabad


ఆణిముత్యాల్లాంటి ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమా మీద అంతకంతకూ అంచనాలుపెంచుకుంటూ వెళ్తోంది ''లవ్ స్టోరి'' మూవీ టీమ్. అందమైన జంట నాగ చైతన్య,సాయి పల్లవి నటించిన ఈ చిత్రాన్ని అభిరుచి, ప్రతిభ, ప్రేక్షకుల నాడితెలిసిన దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ''లవ్ స్టోరి'' చిత్రంలోరెండు పాటలు 'ఏయ్ పిల్లా', 'నీ చిత్రం' చూసి ఇప్పటికే రిలీజ్ అయ్యి రికార్డ్ వ్యూస్ సాధించగా...తాజాగా మూడో పాట'సారంగ దరియా' విడుదల చేశారు. ఈ పాట స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగాఇవాళ (ఆదివారం) ఉదయం 10.08 నిమిషాలకు రిలీజ్ అయ్యింది.

వినగానే గుర్తుండిపోయే, తెలియకుండానే పాడుకునే మాయాజాలం జానపద గీతంసొంతం. అలాంటి జానపద గీతం దర్శకుడు శేఖర్ కమ్ముల గారి ఆలోచనల్లోరూపుదిద్దుకుంటే అది మరింత అద్భుతంగా ఉంటుంది. ఆ పాటకు ఎవరు అవసరమో, ఎవరిప్రతిభను ఎంత తీసుకోవాలని ఈ దర్శకుడికి బాగా తెలుసు. 'సారంగ దరియా' కుప్రసిద్ధ గీత రచయిత సుద్ధాల అశోక్ తేజ పువ్వుల్లాంటి పదాలతో దండలాంటి పాటరాయగా..ఆ పాటకు యువ సంగీత ప్రతిభాశాలి పవన్ సీహెచ్ తో మాంచి ఫోక్ బీట్వేశారు. సూపర్ హిట్ కాంబినేషన్ శేఖర్ మాస్టర్, సాయి పల్లవి మరోసారిడాన్స్ లతో చూపు తిప్పుకోకుండా చేసేశారు. 'పిల్లా మెల్లగ' వచ్చిండే అంటూఫిదా చిత్రంలో ఫిదా చేసిన శేఖర్ మాస్టర్, అంతకంటే అదిరిపోయే క్రియేటివ్స్టెప్పులు సాయి పల్లవితో 'సారంగ దరియా' లో వేయించారు. ఈ పాటను ఫోక్క్వీన్ మంగ్లీ ..ఫుల్ జోష్ లో పాడి ఖుషి చేసింది.

'సారంగ దరియా' పాట విడుదల సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందిస్తూ...

తెలంగాణ జానపద గీతం 'సారంగ దరియా' కి సరికొత్త సొగసులు అద్ది, తనదైనముద్రతో మనకు అందించిన సుద్దాల గారికి 'వేలదండాలు'..మీరు సూపర్ సార్..'కాళ్లకు ఎండి గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్'..

దాని సెంపల్ ఎన్నిల కురియా..దాని సెవులకు దుద్దుల్ మెరియా..అది రమ్మంటే రాదురా సెలియా..దాని పేరే సారంగ దరియా..కిర్రాక్ సంగీతం అందించిన పవన్ కి, అద్భుతంగా డాన్స్ చేసిన సాయిపల్లవికి, చేయించిన శేఖర్ మాస్టర్ కి, పాడిన మంగ్లీకి థాంక్యూ,థాంక్యూ....ఇదంతా సాధ్యం చేసిన మా టీమ్ కు వేల థాంక్స్, ఈ పాటను మొదటసేకరించి మనకి అందించిన రేలారే 'కోమల' కు థాంక్స్. అని ట్వీట్ చేశారు.*

ఏప్రిల్ 16న ''లవ్ స్టోరి'' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి,పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వరరావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు,
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

 


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved