pizza
Samyuktha Hegde & Simran Pareenja about Kirrak Party
`కిరాక్ పార్టీ` హీరోయిన్ల ఇంట‌ర్వ్యూలు
You are at idlebrain.com > news today >
Follow Us

14 March 2018
Hyderabad

నిఖిల్ హీరోగా న‌టించిన చిత్రం `కిరాక్ పార్టీ`. ఈ శుక్ర‌వారం విడుద‌ల కానుంది. స‌మ్ర‌న్‌, సంయుక్త నాయిక‌లు. తెలుగులో వీరిద్ద‌రికీ ఇదే తొలి చిత్రం. ఈ సినిమా గురించి గురువారం హైద‌రాబాద్‌లో వీరిద్ద‌రూ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

ర‌ష్మిక‌ను ఫాలో కాలేదు - సిమ్ర‌న్‌
``కిరాక్ పార్టీ`లో నా పాత్ర పేరు మీరా. కన్న‌డ‌లో ఈ పాత్ర‌ను ర‌ష్మికా చేసింది. ఆ పాత్రను చూసి నేను చాలా అర్థం చేసుకున్నాను. అయితే ర‌ష్మిక‌ను ఫాలో కాలేదు. కొత్త‌గా ఉండాల‌ని మేక‌ర్స్ అన్నారు. ఆ ప్ర‌కార‌మే చేశాను. ర‌ష్మికా అక్క‌డ స్పెక్స్ట్ వేసుకునేది. నేను వేసుకోలేదు. ఇంకా చాలా విష‌యాల్లో మా ఇద్ద‌రి మ‌ధ్య తేడా ఉంది. ఎంత మంది అబ్బాయిలు వెంట ప‌డ్డా ప‌ట్టించుకోని పాత్ర‌. సీనియ‌ర్‌గా క‌నిపిస్తాను. నిఖిల్‌తో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. కొత్త హీరోయిన్‌ని చూసిన‌ట్టు నిఖిల్ ఎప్పుడూ చూడ‌లేదు. చాలా స‌ర‌దాగా, ఫ్రెండ్లీగా ఉండేవాడు. కో స్టార్స్ ని కంఫ‌ర్ట‌బుల్‌గా ఉంచేవాడు. కెమెరా ముందు ఉన్నంత సేపు పాత్ర‌లో లీన‌మైపోయి న‌టించేవాడు. ఈ సినిమాలో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది.``

ఈ సినిమా చూసి చెప్పండి! - సంయుక్త హెగ్డే
``క‌న్న‌డ `కిరిక్ పార్టీ`లోనూ నేను న‌టించాను. అక్క‌డ నా పాత్ర న‌చ్చి, నా పాత్ర‌కు రీ ప్లేస్ ఇంకెవ‌రూ లేరు అని న‌మ్మి ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. ముందు వీళ్లు న‌న్ను క‌లిసిన‌ప్పుడు నేను వేరే బిజీగా ఉండ‌టం వ‌ల్ల చేయ‌న‌న్నారు. రెండో సారి క‌లిసిన‌ప్పుడు ఓకే చెప్పాను. ఇత‌రుల క‌న్నా బాగా చేయాల‌నే త‌ప‌న ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉంటుంది. కానీ ఈ సినిమా విష‌యంలో నాకు నేనే పోటీగా ఉన్నాను. క‌న్న‌డ సినిమా క‌న్నా ఇక్క‌డ ఇంకా బాగా చేయాల‌నే త‌ప్ప‌న‌తో చేశాను. క‌న్న‌డ‌లో ఇదే నాకు తొలి సినిమా. నేను బేసిగ్గా మేక‌ప్‌కి, హెయిర్ స్టైల్స్ కీదూరంగా ఉండేదాన్ని. షూటింగ్ స్పాట్‌లోనూ మేక‌ప్‌మేన్ మేక‌ప్ వేస్తుంటే.. ఇక చాలు అన్న‌ట్టు అనేదాన్ని. తెర‌మీద తీరా చూసుకున్న‌ప్పుడు నేను చేసిన ప‌నుల‌న్నీ నాకు బాగా తెలిశాయి. అందుకే ఈ సినిమా విష‌యంలో ఆ జాగ్ర‌త్త‌లు తీసుకున్నాను. ఇందులో నా పాత్ర పేరు స‌త్య‌. ఫ‌న్ ల‌వింగ్ బ‌బ్లీ గ‌ర్ల్. రియ‌ల్ లైఫ్ పాత్ర ఇది. ఇందులో నేను జూనియ‌ర్‌గా న‌టించాను. నిఖిల్‌తో ల‌వ్‌లో ప‌డుతాను. సినిమాలో నిఖిల్ పేరు కృష్ణ‌. ఇది ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ. ఈ సినిమాలో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంట‌న్న‌ది సినిమాలో చూడాలి. చాలా ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా ఇది. పైసా వ‌సూల్ సినిమా అన‌డంలో సందేహం లేదు.ఆ సినిమా చూశాక‌ ప్ర‌జ‌లు త‌మ కాలేజీ డేస్‌లో ఉన్న అనుభ‌వాల‌ను గురించి మ‌రోసారి గుర్తు చేసుకోవాల‌ని అనుకుంటారు. అంద‌రూ కాలేజీ రోజుల‌కు వెళ్తారు. స్కూల్‌కైనా వెళ్లే ఉంటారు క‌దా. ఆ జీవితాన్ని స్క్రీన్ మీద చూసుకోవ‌చ్చు. ఫ్రెండ్స్ అంద‌రూ క‌లిసి చూసేలా ఉంటుంది సినిమా. తెలుగులో నేను ఇంకా సినిమాను చూడ‌లేదు. త‌ప్ప‌కుండా క్రౌడ్‌తో క‌లిసి చూస్తాను. బోరింగ్ మాత్రం ఉండ‌దు. ఎందుకంటే ఇక్క‌డి నేటివిటీకి త‌గ్గ‌ట్టు నా పాత్ర‌ను మార్చారు. క‌న్న‌డ‌లో బ‌బ్లీ, కిడ్డిష్‌గా ఉంటుంది నా పాత్ర‌. కానీ తెలుగులో మ‌రికాస్త హాట్‌గా క‌నిపిస్తుంది. పీపుల్స్ అటెన్ష‌న్‌ని ఎలా కొల్ల‌గొట్టాలో తెలిసిన పాత్ర‌లో మెప్పిస్తాను. క‌న్న‌డ‌లో నేను ఈ సినిమా చేసిన‌ప్పుడు నా వ‌య‌సు 17 ఏళ్లు. ఇప్పుడు నా వ‌య‌సు 19 ఏళ్లు. తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకున్నా. టాలీవుడ్ నుంచి కొన్ని ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇంకా నేను దేన్నీ అంగీక‌రించ‌లేదు. ఈ సినిమా చూశాక సినిమాల‌కు సంత‌కం చేద్దామ‌ని అనుకుంటున్నా.``


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved