pizza
Sangeetha shifts to Hyderabad
తెలుగు సినిమాకు దూరం కాకుడదనే నిర్ణయంతో హైదరాబాద్‌ వచ్చేశాను - సంగీత
You are at idlebrain.com > news today >
Follow Us

24 September 2016
Hyderaba
d

'ముత్యాలముగు'్గ చిత్రంతో లక్ష్మిగా తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన నటి సంగీత చెన్నై నుండి హైదరాబాద్‌కు ఫిఫ్ట్‌ అయ్యారు. అమీర్‌పేటలో ఇల్లు తీసుకున్నాను. ఇకపై తెలుగు దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉండి, నా వయసుకు తగ్గ పాత్రలు చేయడానికి నేను సిద్ధం అంటున్నారు సంగీత. సినీ, రాజకీయ రంగ ప్రవేశం గురించి గురించి కూడా సంగీత మాట్లాడుతూ - ''నేను తమిళం, మలయాళ సినిమాల్లో, సీరియల్స్‌లో నటించడం వల్ల చెన్నైలో స్థిరపడ్డాను. మధ్యలో కొన్నాళ్లు ఇక్కడ ఉండటం వల్ల కొన్ని తెలుగు సినిమాల్లో నటించాను. అయితే చెన్నైకు మకాం మార్చడంతో తెలుగు సినిమాకు దూరం అయ్యాను. అయితే తెలుగులో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నేను తెలుగు సినిమాకు ఎందుకు దూరం కావాలి అనుకోవడంతో ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేశాను. నా స్వస్థలం వరంగల్‌. తెలుగులో నేను నటించిన చిత్రం 'తీర్పు', కానీ విడుదలైన చిత్రం మాత్రం 'ముత్యాలముగ్గు'. విశ్వేశ్వర్‌రావుగారు, బాపుగారు వంటి వారి అండతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చాను. వారి ఆశీర్వాదంతో మంచి నటిగా గుర్తింపు కూడా సంపాదించుకున్నాను. ఇప్పటికి నేను సినిమా రంగంలోకి ప్రవేశించి నాలుగు దశాబ్దాలవుతుంది. ఇంకా సినిమా రంగంలోనే కొనసాగాలనుకుంటున్నాను. అయితే సీరియస్‌ పాత్రలే కాకుండా జోవియల్‌గా ఉండే అమ్మ తరహా పాత్రలు..అంటే గతంలో ఇడియట్‌ చిత్రంలో చేసిన తరహాతో పాటు అన్నీ రకాల పాత్రల్లో నటించాలనుకుంటున్నాను. తెలుగులో 200 సినిమాలు, అందులో వందకు పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను. ఒక ఓరియా చిత్రలో కూడా నటించాను. కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్నీ భాషల్లో 600సినిమాలకు పైగా నటించాను. ప్రస్తుతానికి నాకు దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. కానీ భవిష్యత్‌లో ప్రొడ్యూసర్‌గా మారే అవకాశాలున్నాయి. అలాగే నేను చెన్నై ఉన్నప్పుడు నన్ను రాజకీయాల్లోకి రమ్మని కూడా ఆహ్వానించారు. అయితే నేను ముందు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాను కాబట్టి టి.ఆర్‌.ఎస్‌. పార్టీలో చేరాలనుకుంటున్నాను. సినిమాకు సంబంధించిన ప్రభుత్వం వారు ఏదైనా బాధ్యత అప్పగించినా నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌గారి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. త్వరలోనే ఆయన్ను కలిసిన నా నిర్ణయం ఆయనకు తెలియజేస్తాను'' అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved