pizza
Santha movie in songs shooting
పాటల చిత్రీకరణలో "సంత"
You are at idlebrain.com > news today >
Follow Us

12 March 2018
Hyderabad

సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు. ఓ సంత నేపధ్యంలొ ప్రేమకథగా ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ జొనర్ లొ తెరకెక్కుతొన్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది.

దర్శకుడు ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. సంత తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ నెల 14 నుంచి మిగిలిన టాకీ పార్ట్ మరియు పాటలను చిత్రీకరిస్తాము. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లొ పాటల చిత్రీకరణ చెస్తాము. ఈ షెడ్యూల్ లొనె సినిమా షూటింగ్ ను కూడా ఫినిష్ చెస్తామన్నారు.

కిన్నెర, మధుమణి, జబర్దస్త్ ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎస్.కె.అనీఫ్, డా.పసునూరి రవీందర్, ఫెట్స్ : రవి పాటలు : గోరెటీ వెంకన్న,కాసర్ల శ్యామ్,మౌనశ్రీ మల్లిక్, మాట్లా తిరుపతి, డిఓపి: ఫణీంద్ర వర్మ అల్లూరి, నిర్మాత : శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, కథ- కథనం- సంగీతం- దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్..


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved