pizza
Sarrainodu pre-release function in Vizag on 10 April
ఆడియోకి అనూహ్య‌మైన స్పంద‌న‌, కోటి రూపాయిల ఖ‌ర్చుతో ఏప్రిల్ 10న వైజాగ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'సరైనోడు ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 April 2016
Hyderaba
d

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో,సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కిన‌ చిత్రం సరైనోడు. తమన్ సంగీతమందించిన ఆడియో ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఆడియోకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తుంది. ఏప్రిల్ 10న విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేస్తున్న‌ట్టు ఆల్‌రెడి ఎనౌన్స్ చేశారు. అయితే ఆ ఫంక్ష‌న్ ని చాలా గ్రాండ్ గా అభిమానుల స‌మ‌క్షంలో చేయ‌టానికి భారి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. పూర్తి ఎల్‌.ఇ,డి స్టేజ్ తో విశాఖ‌పట్నం రామ‌కృష్ణ బీచ్ లో దాదాపు రెండు కిలోమీట‌ర్ల ప‌రిదిలో ఈ ఫంక్ష‌న్ ని జ‌రుపుతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆంధ్రా, తెలంగాణా, కేర‌ళ‌, క‌ర్ణాట‌క , త‌మిళ‌నాడు మ‌రియు వివిధ ప్రాంతాల్లో ఉన్న అభిమానులంతా హ‌జ‌ర‌వుతున్నారు. ఇంత భారీగా చేస్తున్న ఈ ఫంక్ష‌న్ కి దాదాపు కొటి రూపాయిలు ఖ‌ర్చు వ‌ర‌కూ అవ్వ‌నుంది. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ గా తెరెకెక్కుతుంది. ఈ చిత్రంలో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కి దాదాపె కోటి రూపాయిల పైన ఖ‌ర్చు చేసి భారి యాక్ష‌న్ ఎపిసోడ్ తీసారు. అలానే ఎన్నో హైలెట్స్ వున్న ఈ చిత్రాన్నిఅన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో ఆడియో కోసం ట్రెండ్ కావడం విశేషం.యాక్ష‌న్‌ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన‌ ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.... విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. త‌రువాత విడుద‌ల చేసిన హీరోయిన్ అంజ‌లి, అల్లు అర్జున్ మెస్మ‌రైజింగ్ స్టెప్ తో బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే లిరిక్ తో వ‌చ్చే సాంగ్ టీజ‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఇప్ప‌డు విడుద‌ల‌య్యిన అన్ని సాంగ్స్ ఆరేంజ్ లోనే థ‌మ‌న్ అందించాడు. ఈ ఆడియోని ఏప్రిల్ 1న డైరెక్టుగా మార్కెట్ లోకి విడుద‌ల చేసాము,ఆడియోకి అభిమానుల నుండి మంచి స్పంద‌న వ‌స్తుంది. అత్యంత భారీగా ఏప్రిల్ 10న విశాఖ‌ప‌ట్నం లో గ్రాండ్‌ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నాము. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సరైనోడు చిత్రంపై ఉన్న భారీ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతాం.ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపోందిప ఈ చిత్రంలో అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అని అన్నారు.

అలాగే చిత్రం లో విశేష ఆదరణ పొందుతున్న బ్లాక్ బస్టర్ సాంగ్ 2 నిమిషాల వీడియో ని సైతం ఈ రొజు ఆన్ లైన్ లొ విడుదల చేస్తున్నట్లు తెలిపారు

నటీనటులు
అల్లు అర్జున్,
రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో)

సాంకేతిక వర్గం
బ్యానర్ - గీతా ఆర్ట్స్
ప్రొడక్షన్ కంట్రోలర్స్ - బాబు, యోగానంద్
చీఫ్ కోఆర్డినేటర్ - కుర్రా రంగారావ్
ఫైట్ మాస్టర్స్ - రామ్ లక్ష్మణ్, రవి వర్మ
పాటలు: రామ జోగయ్య శాస్త్రి , అనంత్ శ్రీరాం, క్రిష్ణ చైతన్య శ్రీమణి
కొరియోగ్రఫి :దినేష్, జాని, బాస్కో సీజర్, శేఖర్, గణెష్ ఆచార్య, భాను
మీడియా రిలేషన్స్ -ఎస్.కె.ఎన్ & ఏలూరు శ్రీను
ఆర్ట్ డైరెక్టర్ - సాహి సురేష్
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్
డిఓపి - రిషి పంజాబి
డైలాగ్స్ - ఎం.రత్నం
మ్యూజిక్ - ఎస్ ఎస్ తమన్
కో ప్రొడ్యూసర్ - శానం నాగ అశోక్ కుమార్
ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్
డైరెక్టర్ - బోయపాటి శ్రీను


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved