pizza
Crazy Horror Entertainer "Sashikala" Releasing on March 25th
హారర్ ఎంటర్ టైనర్ "శశికళ" వస్తోంది !!
You are at idlebrain.com > news today >
Follow Us

17 March 2016
Hyderaba
d

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన హారర్ చిత్రాల్లో "మూచ్" ఒకటి. ఈ చిత్రాన్ని తెలుగులో "శశికళ" పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వినుభారతి దర్శకుడు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ గొలుపుతూ.. భయపెడుతూనే వినోదం అందించే హారర్ ఎంటర్ టైనర్ ఇది. ప్రఖ్యాత దర్శకుడు భారతిరాజా సోదరుడు జయరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి భారతిరాజా శిష్యుడు విను భారతి దర్శకత్వం వహించారు. హారర్ చిత్రాలను ఆదరించేవారందరికీ "శశికళ" అమితంగా నచ్చుతుంది" అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేష్, ఎడిటింగ్: శివ వై. ప్రసాద్, సంగీతం: నిత్యన్ కార్తీక్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: విను భారతి!!

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved