pizza
Sathee Thimmamamba shooting completed
You are at idlebrain.com > news today >
Follow Us

20 July 2015
Hyderabad

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ తిమ్మమాంబ’

ఎస్‌.ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై భవ్యశ్రీ ప్రదాన పాత్రలో రూపొందుతున్న హిస్టారికల్‌ మూవీ ‘సతీ తిమ్మమాంబ’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం మాట్లాడుతూ..‘అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఏడెకరాల భూమిలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. 600 వందల సంవత్సరాల చరిత్ర గలిగిన ఈ చెట్టు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించింది. ఈ చరిత్రను ప్రజలకు చేరవేయాలనే ఉద్ధేశ్యంతో ఆ తిమ్మమ్మ వారసుసులమైన మేము ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చెట్టు ఎంతో మహిమ గలది. అన్ని కాలాలలోనూ పచ్చగానే ఉంటుంది. ఈ చెట్టు దగ్గర ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక ఆ కోరిక తీరుతుందనే నమ్మకం ఇప్పటికీ ప్రజలలో ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి అయింది. షూటింగ్ అనంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల ఆఖరికి ఆడియో ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాము..' అని అన్నారు.

భవ్యశ్రీ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రభాకర్‌, రంగనాధ్‌, చంద్రమోహన్‌, రాజశ్రీ, జూనియర్‌ రేలంగి మొదలగు వారు ఇతర తారాగణం.

ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్య కవి,
దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్‌. రామ్‌కుమార్‌,
నిర్మాత: పెద్దరాసు సుబ్రమణ్యం,
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved