pizza
Sekhar Kammula sanitisers
పారిశుద్ధ్య కార్మికులు అందించే సేవలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిరు సాయం.
You are at idlebrain.com > news today >
Follow Us

27 April 2020
Hyderabad



కరోనా విపత్కర కాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఈ ఎండలలో తమ విధులనునిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత చెబుతూ ఒకనెల రోజుల పాటు వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించేందుకు ముందుకువచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ జి హెచ్ ఎమ్ సి ఆధికారులతో ప్రారంభించారు శేఖర్ కమ్ముల.ప్రతి రోజూ తమ ఎరియాలో తిరిగే వారిని చూస్తే వారందరూ మన ఆరోగ్యం కోసంకష్టపడుతున్నారు. వారి ఆరోగ్యం కోసం మనం ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అని అన్నారు.నార్త్ జోన్ పరిధిలోపనిచేసే వెయ్యిమంది పారిశుద్య కార్మికులకు నెల రోజుల పాటు ఈ చలువ చేసేపానీయాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్నిజి హెచ్ ఎమ్ సి నే నిర్వహిస్తుంది. వారే తమ సిబ్బందికి ప్రతిరోజూ ఈపానీయాలు అందేలా చూసుకుంటారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడతూ:‘‘పారిశుద్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలు అమోఘం. వారి ఆరోగ్యంగురించి ఆలోచించి దర్శకులు శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాన్నిఅభినందిస్తున్నాను.ఈ రోజు కరోనా నివారణకు స్వీయ నియంత్రణ తప్ప మరో మందులేదు. లమన ప్రియతమ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది ఇళ్ళుకదలడం లేదు. కానీ కొంతమంది లో ఇంకా మార్పురావాలి. బయటకు అనవసరంగా వచ్చివ్యాధి వ్యాప్తికి కారణం అవుతున్నారు. వారిని నేను అభ్యర్దిస్తున్నాను.శేఖర్ కమ్ముల వంటి దర్శకులు సమాజానికి సేవలందిస్తున్న వర్కర్స్ పట్లచూపుతున్న ప్రేమకు ధన్యావాదాలు ’’అన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ:‘‘ నేను మా ఏరియా లో ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్మికుల నిచూస్తుంటాను.వారు ఎండలో కష్టపడుతూ ఉంటారు.వారికి థ్యాంక్స్ చెప్పాలనేఆలోచన తో ఒక వెయ్యి మందికి నెల రోజుల పాటు పాలు, మజ్జిగ అమిగోస్సంస్థనుండి అందివ్వాలని నిర్ణయించుకున్నాం.వాటిని మేము పంచడం కంటే వారిసిబ్బంది ద్వారా నే అందించగలిగితే వారికి మరింత గౌరవం ఇచ్చినవారమవుతాం..అని ఈ పంపిణిని జి హెచ్ ఎమ్ సి వారికే అప్పగించాం.ఈ ప్రోగ్రాం తో మరికొంతమంది వారికి సహాయంగా నిలుస్తారని ఆశిస్తున్నాను. పారిశుద్ధ్యకార్మికులంటే నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. వారికి చేసేది కేవలంకృతజ్ఞతతోనే. ఇప్పుడు మనిషికి మనిషి తోడుండాల్సిన సమయం.ఇది తప్ప వేరేదారిలేదు.’’ అన్నారు

 

 

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved