pizza
Sharath Srirangam about Seetha.. Ramuni Kosam
`సీత.. రాముని కోసం` ...ఆక‌ట్టుకునే థ్రిల‌ర్ - శ‌ర‌త్ శ్రీరంగం
You are at idlebrain.com > news today >
Follow Us

12 December 2017
Hyderabad

తెలుగు టీవీ సమర్పణలో శరత్ శ్రీరంగం, కారుణ్య జంటగా నటిస్తున్న చిత్రం `సీత..రాముని కోసం`. అనిల్ గోపిరెడ్డి సంగీత మరియు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమా డిసెంబ‌ర్ 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ‌ర‌త్ శ్రీరంగం మీడియా ప్ర‌తినిధుల‌తో సినిమా గురించి మాట్లాడుతూ - ``మాది హైద‌రాబాద్. నేను సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌ని. అమెరికాలో నాకొక సాఫ్ట్‌వేర్ కంపెనీతో పాటు ఓ ఛానెల్ కూడా ఉంది. నాకు సినిమాల్లోకి రావాల‌నే ఆస‌క్తి ఏర్ప‌డ‌టంతో చాలా మంది ద‌ర్శ‌కుల‌ను క‌లిశాను. మంచి క‌థ కోసం వెయిట్ చేస్తున్న త‌రుణంలో డైరెక్ట‌ర్ అనిల్‌గారి గురించి తెలిసింది. నేను నా ఫోటోల‌ను పంప‌గానే ఆయ‌న‌కు నచ్చింది. ఆయ‌న న‌న్ను పిలిచి క‌థ చెప్ప‌మ‌న్నారు. నాకు కూడా క‌థ బాగా న‌చ్చింది. మా నాన్న‌గారు ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌. అమ్మ గృహిణి. న్యూయార్క్ ఫిలిం ఆకాడ‌మీలో కోర్సు చేశాను. ఇందులో నా పాత్ర పేరు విక్ర‌మ్‌. ఓ స‌మ‌స్య‌ను సాల్వ్ చేసే పాత్ర‌. ఇది ఆక‌ట్టుకునే థ్రిల్ల‌ర్ మూవీ. అవుట్ పుట్ ఎలా ఉంటుందోన‌ని కాస్త టెన్ష‌న్ ఉండేది. కానీ ఫ‌స్ట్ కాపీ చూశాక‌, చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. న‌టుడిగా సంతృప్తి పొందాను. ఎక్క‌డా డిస‌ప్పాయింట్ మెంట్ లేదు. బ్యాలెన్స్ చేసుకుంటూ వ‌చ్చాను. రాజ్‌కందుకూరి, వివేక్ ఆత్రేయ‌, కొర‌టాల శివ త‌దిత‌రులు మాకెంతో స‌పోర్ట్ చేశారు. ఈ సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved