pizza
Malkapuram Shivakumar Bought "Singam 3" For Fancy Price
ఫ్యాన్సీ రేటుతో సింగం-3 తెలుగు హక్కులు దక్కించుకున్న మల్కాపురం శివకుమార్!
You are at idlebrain.com > news today >
Follow Us

07 August 2016
Hyderaba
d

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గినట్లుగానే ఈ చిత్రం తెలుగు హక్కులకు భారీ పోటీ నెలకొంది. అయితే ఈ చిత్రం తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ప్యాన్సీ రేటుతో దక్కించుకున్నాడు.

ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ తొలినుంచి మా సంస్థలో వైవిధ్యమైన చిత్రాలను అందించాలను భావనతోనే ఇటీవల సూర్య వర్సెస్ సూర్య, శౌర్య చిత్రాలను నిర్మించాను. ఇప్పుడు తాజాగా సూర్య ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3ను తెలుగు హక్కులను దక్కించుకోవడం ఆనందంగా వుంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి. వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం షూటింగ్‌లో అధికభాగం జరగడం విశేషంగా చెప్పుకోవాలి. తప్పకుండా ఈ చిత్రం తెలుగులో అఖండ విజయం సాధిస్తుందని నమ్మకం వుంది. ప్రముఖ కథానాయికలు అనుష్క శెట్టి, శృతిహాసన్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాతక్మంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. అనుష్క శెట్టి, శృతీహాసన్, రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హేరీస్‌జైరాజ్,

 


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved