pizza
Simple Love Story music launch on 12 August
You are at idlebrain.com > news today >
Follow Us

01 August 2015
Hyderabad


ఆగస్ట్‌ 12న లహరి మ్యూజిక్‌ ద్వారా 'సింపుల్‌ లవ్‌స్టోరీ' ఆడియో విడుదల

గాయత్రి సినీ క్రియేషన్స్‌ పతాకంపై కుమార్‌ సమర్పణలో రవివర్మ. యం దర్శకత్వంలో నిర్మాతలు కుండలి పాండురంగం, మద్దెల అనిల్‌ కుమార్‌ నిర్మాతలుగా రూపుదిద్దుకున్న చిత్రం 'సింపుల్‌ లవ్‌స్టోరీ'. ఈ చిత్ర ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా ఆగస్ట్‌ 12న విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు కుండలి పాండురంగం, మద్దెల అనిల్‌కుమార్‌లు మాట్లాడుతూ...''లవ్‌-రొమాన్స్‌-కెరియర్‌' నేపథ్యంతో యువతకు ఓ గొప్ప సందేశాత్మక చిత్రం ఇవ్వబోతున్నాడు మా దర్శకుడు రవివర్మ. సరికొత్త సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేటి యువతనే కాకుండా యావత్తూ ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవలే రషెస్‌ చూశాము. సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్‌ 12న లహరి మ్యూజిక్‌ ద్వారా సంగీత దర్శకుడు రమేష్‌ ఎమ్‌. అందించిన పాటలను ప్రేక్షకులకు అందించనున్నాము. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్‌ ప్రతిష్టను పెంచే చిత్రమవుతుందని ఆశిస్తున్నాము..' అన్నారు.

చిత్ర దర్శకుడు రవివర్మ. యం మాట్లాడుతూ..''కాలేజీ నేపథ్యంలో సాగే ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. కాలేజీలో ఉండే సీనియర్‌, జూనియర్‌ అని ఉండే రెండు బ్యాచ్‌ల మధ్య జరిగే లవ్‌, రొమాన్స్‌ అండ్‌ కామెడీ మూవీ ఇది. ఇందులో నటించిన కార్తీక్‌-అమితారావు, కార్తీకేయ-సమలిశర్మ, కిరణ్‌-మధులగ్నదాస్‌, నరేష్‌-అన్వికలతో పాటు మిగతా తారాగణం అంతా మూవీ కోసం చాలా సహకరించారు. వారి అద్భుతమైన నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఓ గొప్ప సందేశాన్ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. మా నిర్మాతలు ఈ చిత్ర రూపకల్పనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సంగీత దర్శకుడు రమేష్‌. యం ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు. ఆగస్ట్‌ 12న లహరి మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలవుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను..' అని అన్నారు.

కార్తీక్‌-అమితారావు, కార్తీకేయ-సమలిశర్మ, కిరణ్‌-మధులగ్నదాస్‌, నరేష్‌-అన్విక హీరో హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రంలో భానుచందర్‌, ధన్‌రాజ్‌, శివారెడ్డి, చంటి, చిట్టిబాబు, అన్నపూర్ణ మొదలగువారు ఇతర తారాగణం.

ఈ చిత్రానికి కెమెరా: టి.కె. పరందామ, సంగీతం: రమేష్‌. యం, సమర్పణ: కుమార్‌

నిర్మాతలు: కుండలి పాండురంగం, మద్దెల అనిల్‌కుమార్‌.

కథ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్‌-దర్శకత్వం: రవివర్మ. యం



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved