pizza
Simrath about Prematho Mee Karthik
నేను క‌రాటే గోల్డ్ మెడ‌ల్ సాధించాను ‍‍‍‍- సిమ్ర‌త్‌
You are at idlebrain.com > news today >
Follow Us

16 November 2017
Hyderabad


కార్తికేయ, సిమ్రత్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’. రిషి దర్శకుడు. రవీందర్ ఆర్.గుమ్మకొండ నిర్మాత. ఈ సినిమా నవంబర్ 17న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సిమ్రత్ సినిమా గురించిన విశేషాలు గురించి తెలియుజేస్తూ..‘‘నేను పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. ప్రస్తుతం బి.ఎస్.సి కంప్యూటర్స్ చేస్తున్నాను. నాకు నటన అంటే ఆసక్తి ఉండేది కాదు. నేను నేషనల్ కరాటేలో గోల్డ్‌వెుడల్ సాధించాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నాఫోటోలను చూసిన సినిమా కో ఆర్డినేటర్ ఒకరు నన్ను సినిమాలో నటించమని అడిగారు. నాకు నటన అంటే ఆసక్తి లేదని చెప్పేశాను. కానీ మా అమ్మగారు నన్ను కనీసం ఆడిషన్ అయినా ఇవ్వమని చెప్పారు. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత, డైరెక్టర్ కథ చెప్పారు. నాకు సినిమాల్లో నటించడం ఆసక్తి లేదని చెప్పాను. అయితే డైరెక్టర్ రిషిగారి నటించడానికి నన్ను ఒప్పించారు. ఈ సినిమాలో నేను బబ్లీ అమ్మాయి పాత్రలో కనపడతాను. హీరో కార్తీకేయ ఎటువంటి ఎమోషన్స్ లేని అబ్బాయిగా ఈ సినిమాలో కనపడతారు. తను నాతో ప్రేమలో పడతాడు. తనలో ఓ ఎమోషనల్ వేవ్స్ క్రియేట్ చేసే అమ్మాయి పాత్రలో నటించాను. ఈ ఫీల్డ్‌లోకి రాకముందు నాకు సినిమాలంటే బొత్తిగా ఆసక్తి ఉండేది కాదు..కానీ ఇప్పుడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. అల్రెడి మరో సినిమా కూడా సైన్ చేశాను. తర్వలో దాని వివరాలు చెబుతాను. నాకు బేసిక్‌గా నాకు కరాటే అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలకు కరాటే కూడా నేర్పుతుంటాను. ప్రేమతో మీ కార్తీక్ నా తొలి చిత్రం. అంతకు ముందు కనీసం కెమెరా కూడా ఫేస్ చేయులేదు. కార్తీక్ చాలా మంచి వ్యక్తి. సెట్‌లో అందరినీ కలుపుకుపోతుంటాడు. మంచి కో ఆర్టిస్ట్. తెలుగు భాషలో నాకున్న కష్టాన్ని అర్థం చేసుకున్న తను..ఎంతో సపోర్ట్ చేశాడు’’ అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved