pizza

Dulquer Salmaan, Hanu Raghavapudi, Swapna Cinema’s Sita Ramam First Single Lyrical Out
దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి - స్వప్న సినిమా '' సీతా రామం'' ఫస్ట్ సింగిల్ గ్రాండ్ వింటేజ్ లవ్లీ మెలోడీ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

09 May 2022
Hyderabad

Director Hanu Raghavapudi is readying a fascinating love story which is set in the backdrop of war. Dulquer Salman and Mrunal Thakur are playing Rama and Sita in the film titled Sita Ramam. The film is produced by Ashwini Dutt and Priyanka Dutt under Swapna Cinema and presented by Vyjayanthi Movies

The first single of this movie that is out now is going to be with music lovers forever. The song composed by Vishal Chandrashekar is now up for grabs. Anantha Sriram described the enchanting love story in an appealing manner with his lyrics, while SP Charan and Ramya Behara sung the song expressively.Bringing back memories of a vintage Ilayaraja-SPB musical, this is a soothing melody that will instantly appeal to it’s listeners making them play the song on loop.

The song is a visual feast and the chemistry between Dulquer and Mrunal is another striking element. This song has set the bar high for the remaining songs of the album.

The film also stars Rashmika Mandanna playing a very special and significant role as Afreen.

PS Vinod is the cinematographer for Sita Ramam being made simultaneously in Telugu, Tamil and Malayalam languages.

The film also stars Rashmika Mandanna playing a very special and significant role as Afreen.

PS Vinod is the cinematographer for Sita Ramam being made simultaneously in Telugu, Tamil and Malayalam languages.

Cast: Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna, Sumanth, Gautam Menon, Prakash Raj and others.

Technical Crew:
Director: Hanu Raghavapudi
Producers: Ashwini Dutt
Banner: Swapna Cinema
Presents: Vyjayanthi Movies
DOP: PS Vinod
Music Director: Vishal Chandrasekhar
Editor: Kotagiri Venkateswara Rao
Production Design: Sunil Babu
Art Director: Vaishnavi Reddy,Ali thots
Costume Designer: Sheetal Sharma

దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి - స్వప్న సినిమా '' సీతా రామం'' ఫస్ట్ సింగిల్ గ్రాండ్ వింటేజ్ లవ్లీ మెలోడీ విడుదల

వెండితెరపై హృద్యమైన ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధం నేపధ్యంలో ఓ అందమైన ప్రేమకథ '' సీతా రామం' చిత్రం రూపుదిద్దుకుంటుంది. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకం పై అశ్వినీదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్ 'ఓ సీతా- హే రామా' పాట విడుదల చేశారు. ఈ పాట సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ప్లజంట్ ట్రాక్ గా నిలిచింది.

అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటని మరో స్థాయికి తీసుకెళ్లింది.

♪♪ ఓ.. సీతా.. వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడవుతా
దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపేనే నుదిటి రాత
నుదుట తిలకమై వాలుత ♪♪

పాటలో వినిపించిన ఈ సాహిత్యం '' సీతా రామం' ప్రేమకథలో మాధుర్యాన్ని అందంగా చెప్పాయి.

ఎస్పీ చరణ్, రమ్య బెహరా పాటని అద్భుతంగా ఆలపించారు. వింటేజ్ ఇళయరాజా-ఎస్పీబీ మ్యూజికల్ మోమోరీస్ ని ఈ పాట గుర్తుకు తెచ్చింది. ఆడియన్స్ లూప్ మోడ్ లో పెట్టుకొని మళ్ళీమళ్ళీ వినే చార్ట్ బస్టర్ మెలోడీగా ఈ పాట ఆకట్టుకుంది.

పాటలో కనిపించిన విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి. దుల్కర్, మృణాల్ మధ్య కెమిస్ట్రీ బ్యుటిఫుల్ గా వుంది. పాటలో మ్యూజిక్ మేకింగ్ కూడా చూపించారు. పెద్ద వయోలిన్ ట్రూప్ తో గ్రాండ్ సింఫనీ ఆర్గనైజ్ చేసి ఈ పాటని రికార్డ్ చేశారు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో నిర్మాతలు ప్రత్యేక ద్రుష్టి పెట్టి అద్భుతమైన ఆల్బమ్ ని ప్రేక్షకులకు వినిపించే లక్ష్యంతో వున్నారని ఫస్ట్ సింగల్ రికార్డింగ్ చూస్తే అర్ధమౌతుంది.

ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న అఫ్రీన్‌ అనే కీలకమైన పాత్ర పోషిస్తుంది.

తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు.

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాతలు: అశ్వినీదత్, ప్రియాంక దత్
బ్యానర్: స్వప్న సినిమా
సమర్పణ: వైజయంతీ మూవీస్
ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved