pizza
Sivabalaji turns producer
You are at idlebrain.com > news today >
Follow Us

2 September 2015
Hyderabad

నిర్మాతగా మారిన నటుడు శివబాలాజీ

‘ఇది అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ’ సినిమాతో తెరంగేట్రం చేసి ‘ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, శంభో శివ’ శంభో వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ. విలక్షణమైన పాత్రల్లో నటించిన శివబాలాజీ ఇప్పుడు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే తలంపుతో నిర్మాతగా మారారు. గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ‘పడ్డానండీ ప్రేమలో మరి’ వంటి క్యూట్ లవ్ స్టోరీని రూపొందించిన దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఓ సినిమాని రూపొందిస్తున్నా. శివబాలాజీతో పాటు ఇటు విలన్ గా, అటు క్యారెక్టర్ ఆరిస్ట్ గా రాణిస్తున్న అజయ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తోరూపొందనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇద్దరు స్నేహితుల కథను 1980 బ్యాక్ డ్రాప్ పై, ఓ నిజ ఘటన ఆధారంగా దర్శకుడు మహేష్ ఉప్పుటూరి తెరకెక్కిస్తున్నారు. శివబాలాజీ, అజయ్ ఈ చిత్రంలో క్యారెక్టర్స్ చాలా హైలైట్ గా ఉంటాయి. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ తో సినిమా ఉంటుందని దర్శకుడు మహేష్ ఉప్పుటూరి అన్నారు.

శివబాలాజీ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ధన్ విన్, కెమెరా: భరణి కె.ధరణ్, మ్యూజిక్: సునీల్ కశ్యప్; నిర్మాత: శివబాలాజీ మనోహరన్, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved