pizza
Siva Ganga release on 27 November
నవంబర్ 27న విడుదలవుతున్న ‘శివ గంగ’
You are at idlebrain.com > news today >
Follow Us

15 November 2015
Hyderabad

శ్రీరామ్‌, రాయ్‌లక్ష్మీ, సుమన్‌, మనోబాల, వడివుక్కరసి ముఖ్యపాత్రధాయిగా రూపొందిన చిత్రం ‘శివగంగ’. కుమార్‌బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి.సి.వడి ఉడయాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘అరుంధతి’, ‘కాంచన’, ‘చంద్రముఖి’, ‘గంగ’, ‘చంద్రకళ’ చిత్రాల తరహాలో ఈ సినిమా హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. తెలుగు, తమిళంలో నవంబర్ 27న గ్రాండ్ లెవల్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...

చిత్ర సమర్పకుడు కుమార్‌ బాబు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం తెలుగు, తమిళంలో హర్రర్‌ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా మా ‘శివ గంగ’ చిత్రం కూడా హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో సినిమాని రూపొందించాం. అన్నీ కమర్షియల్‌ హంగులతో, ఉహించని ట్విస్ట్ లతో సినిమా సాగుతుంది. రెండు ఆత్మల ప్రతీకారం తీర్చుకోవడమనే కాన్సెప్ట్ తో సినిమా సాగుతుంది. తెలుగు, తమిళ ప్రేక్షకకులకు సుపరిచితుడైన నటుడు శ్రీరామ్‌ ఇందులో శివ, శక్తి అనే రెండు రోల్స్ ను పోషించాడు. అలాగే రాయ్‌లక్ష్మీ కూడా గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ చేసింది. 37 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతాయి. సీనియర్‌ నటుడు సుమన్‌ నెగటివ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ లెవల్ లో సినిమాను నవంబర్ 27న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

నిర్మాతలు కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుండి తొలి చిత్రంగా రానున్న భారీ బడ్జెట్‌ మూవీ ‘శివ గంగ’. హర్రర్‌ , యాక్షన్‌ విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ మూవీ రూపొందింది. డైరెక్టర్‌ వి.సి.వడి ఉడయాన్‌ సినిమాని ఎక్సలెంట్‌గా తెరకెక్కించారు. హై టెక్నికల్‌ వాల్యూస్ ఉన్న చిత్రం. కనల్‌ కణ్ణన్‌ ఫైట్స్‌, జాన్‌ పీటర్‌ మ్యూజిక్‌, ఎస్‌.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను నవంబర్ 27న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

శ్రీరామ్‌, రాయ్‌లక్ష్మి, సుమన్‌, వడివుక్కరసి, రేఖ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్‌: కణల్‌ కన్నన్‌, సంగీతం: జాన్‌ పీటర్‌, కెమెరా: ఎస్‌.శ్రీనివాసరెడ్డి, మాటలు: ఎం.రాజశేఖర్‌రెడ్డి, పాటలు: వనమాలి, వెలిదండ్ల, ఎడిటర్‌: ఎలీనా, ఆర్ట్‌: దేవరాజ్‌, నిర్మాతలు: కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శకత్వం: వి.సి.వడి ఉడయాన్‌.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved