pizza
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 9 న అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ ల 's/o స‌త్య‌మూర్తి' విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

30 March 2015
Hyderabad

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 's/o స‌త్య‌మూర్తి సెన్సార్ కార్య‌క్ర‌మాలు
పూర్తిచేసుకుని ఏప్రిల్ 9న అత్య‌ధిక ధియోట‌ర్స్ లొ విడుద‌ల‌వుతుంది.ఇటీవ‌లే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతమందించిన ఆడియో సూప‌ర్‌హిట్ అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈరోజు సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఎటువంటి క‌ట్స్ లేకుండా U/A స‌ర్టిఫికేట్ రావ‌టం విశేషం అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ తో మా బ్యానర్లో చిత్రీకరిస్తున్న's/o స‌త్య‌మూర్తి' చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుంది.దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు ఇప్ప‌టికే సూప‌ర్‌హిట్ అయ్యాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఈరోజు సెన్నారు పూర్తిచేసుకుని చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తున్నాం. మాచిత్రానికి U/A స‌ర్టిఫికేట్ ఎటువంటి క‌ట్స్ లేకుండా రావ‌టం సంతోషంగా వుంది.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ మ‌రియు ల‌క్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

నటీనటులు
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు

సాంకేతిక వర్గం
పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను
ఆర్ట్ - రవీందర్
కెమెరా - ప్రసాద్ మూరెళ్ల
మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్
నిర్మాత - రాధాకృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved