pizza
Spider-Man: For From Home release on 4 July
అభిమానుల డిమాండ్ మేర ఇండియాలో ముందుగానే విడుద‌ల‌వుతున్న `స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం`
You are at idlebrain.com > news today >
Follow Us

26 June 2019
Hyderabad

వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో స్పైడ‌ర్ మ్యాన్‌. అవెంజ‌ర్స్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత `స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం` రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి `స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం` సిద్ధ‌మ‌వుతోంది.

`స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం` చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా విడుద‌ల చేస్తుంది. ఇంగ్లీశ్‌, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మార్వెల్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాల‌పై క్రేజ్ క్ర‌మంగా పెరుగుతుంది. ఈ సంద‌ర్భంగా...

సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ ``సూప‌ర్‌హీరో స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల‌కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే `స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం`పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాను జూలై 4న విడుద‌ల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌, త‌మిళంలో సినిమాను విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved