pizza
Sree Harsha Konuganti about Hushaaru
కామన్‌ సెన్స్‌ ఉన్న ప్రతి ఒక్కరూ సినిమా తీయగలరు - శ్రీహ‌ర్ష కొనుగంటి
You are at idlebrain.com > news today >
Follow Us

28 November 2018
Hyderabad

బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష కొనుగంటి సినిమా గురించి మాట్లాడుతూ ....

- నేను హైదరాబాద్‌ లోనే పుట్టి పెరిగాను. చిన్న‌ప్పుడే నాకు స్టోరీస్‌ అంటే ఇష్టం. నేను 10 తరగతికి వచ్చేటప్పటికి ఆఇష్టం మరింత పెరిగింది. తరువాత చదువుపై దృష్టి పెట్టి ఇంజనీరింగ్‌ పూర్తి చేసి యూకేలో మాస్టర్స్‌ చేశాను. తరువాత కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్ తీశాను. హైదరాబాద్‌లో సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ తీసుకుంటున్నసమయంలో `హుషారు` స్క్రిప్ట్‌ రాయడం మొదలు పెట్టాను. తరువాత ఈ స్క్రిప్టును మా ఫ్రెండ్స్‌ చదివి చాలా బాగుంది అనడంతో సినిమా డైరెక్ట్‌ చేద్దాం అని నిర్ణయించుకున్నాను.

- నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి సలహా మేరకు లక్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్‌ గారిని కలిసి సినిమా కథ చెప్పాను. ఆయనకు కథ థ్రిల్లింగ్‌ గా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది.

- కథ విషయానికి వస్తే చలాకీగా ఉండే నలుగురు ఫ్రెండ్స్‌ ఒకసారి హాస్టల్‌లో దొంగతనంగా ఓకే బీర్‌ను తాగి తరువాత జీవితం లో ఎలాంటి సమస్యలు వచ్చిన మనం విడిపోకూడదు అని నిర్ణయించుకుంటారు. అలా ఉల్లాసంగా సాగిపోతున్న వారి జీవితంలో అనూహ్యంగా కొంత డబ్బు అవసరం వస్తుంది. వారు ఆ డబ్బును ఎలాంటి మార్గం ద్వారా సంపాదించుకొన్నారు అనేది ఈసినిమా కాన్సెప్ట్‌.

- ముందుగా నేను ఈ కథను విజయదేవరకొండతో తీద్దాం అనుకున్నాను. విజయ్‌ కు కూడా కథ బాగా నచ్చింది. కానీ కథ పరంగా నలుగురు ఫ్రెండ్స్‌ ఉండాలని కొత్త వారితో ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. ఆలా ఈ సినిమాలో అంత కొత్తవారికి పూర్తి ప్రాధాన్యం ఇస్తూ తీసిన సినిమా ఇది.
- సినిమాలో 90 % వరకూ రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్స్‌ ఉంటాయి. మరియు మొత్తం సినిమా అవుట్‌ డోర్‌ షూటింగులో కొత్త లొకేషన్స్‌తో చాలా రియలిస్టిక్‌ గా తీయడం జరిగింది. సినిమా ఎక్కడ బడ్జెట్‌ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా గ్రాండ్‌గా తీశాం.

- సినిమా లో నలుగురి క్యారెక్టర్స్‌ లో నేను కనిపిస్తాను. నాజీవితం లో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని క్యారెక్టర్స్‌ డిజైన్ చేసుకున్నాను. ముఖ్యంగా రాహుల్‌ రామకృష్ణ క్యారెక్టర్‌ నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది.

- నా దృష్టిలో కామన్‌ సెన్స్‌ ఉన్న ప్రతి ఒక్కరూ సినిమా తీయగలరు. అని నేను నమ్ముతాను. ఎందుకంటే హుషారు సినిమా స్క్రిప్ట్ చూస్తే మీకు ఈ విషయం అర్ధమవుతుంది.

- ఈ సినిమాలో టెక్నిషియన్స్‌ అందరు చాలా బాగా పనిచేశారు. నాకు ఈ సినిమా పై పూర్తి నమ్మకం ఉంది

- నా నెక్స్ట్‌ స్టోరీ సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్‌ తరువాత దాని గురించి ఆలోచిస్తాను.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved