pizza
Allu Sirish Srirasthu Subhamastu New Schedule In Kashmir from 9th June
జూన్ 9 నుండి కాశ్మీర్ లో చివ‌రి షెడ్యూల్ లో గీతాఆర్ట్స్‌,ప‌రుశురామ్‌(బుజ్జి), ,అల్లు శిరీష్ ల 'శ్రీరస్తు శుభ‌మ‌స్తు'
You are at idlebrain.com > news today >
Follow Us

08 June 2016
Hyderaba
d

Young hero Allu Sirish who is picking different subjects has teamed up with Lavanya Tripathi for a pure family entertainer film Shrirasthu Shubhamasthu being helmed by Parasuram (Bujji), known for showcasing family emotions precisely. Ace producer and Sirish’s father Allu Aravind is producing the movie under the prestigious Geetha Arts Banner.

Shrirasthu Shubhamasthu’s last shooting scheduled will be canned in exotic locations of Kashmir and with this entire production work will be wrapped up. Very soon, the film’s audio composed by SS Thaman will be launched through a grand ceremony. The makers have plans to release the movie sometime soon.

Director Parasuram said, “I have become very close to Sirish with the journey for Shrirasthu Shubhamasthu. Like me, Sirish also has great respect and liking for joint families. Marriage is key part in everyone’s life. One would know how bride and groom should behave responsible after marriage, only if we have family with us. But, current generation youngsters have forgotten about family emotions and responsibilities. Our film will have right ingredients for all age groups. Each character- whether it is big or small, will have its own significance.”

Sirish said, “I am interested in doing good films from the beginning. In fact, I feel proud myself when someone appreciates me for picking meaningful movies. Bujji is making the family subject, comprising of all commercial elements. Every character in the film is inter-linked to other character. My sequences with Rao Ramesh will be highlight in the film. In fact, our confidence levels will increase, if work with senior actors.

Producer Allu Aravind also hopes his latest production venture Srirasthu Shubhamasthu will become another good hit for his banner.

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతున్న‌ అల్లు శిరీష్‌, వ‌రుస‌గా మంచి చిత్రాలు చేస్తూన్న‌ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, ఫ్యామిలీ లోని చ‌క్క‌టి ఎమెష‌న్స్ ని క్యాచ్ చేసి త‌న క‌థలుగా మ‌లుచుకుని తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతున్న‌ ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, ఏస్‌ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం 'శ్రీరస్తు శుభ‌మ‌స్తుస‌. ఈ చిత్రానికి సంబందించి చివ‌రి షెడ్యూల్ ని కాశ్మీర్ లాంటి మెస్ట్ బ్యూటిఫుల్ విజువ‌ల్స్ లో చిత్రీకరిస్తున్నారు. దీంతో చిత్ర షూటింగ్ పూర్త‌వుతుంది. అతిత్వ‌ర‌లోనే థ‌మ‌న్.S.S సంగీతం అందించిన ఆడియో విడుద‌ల చేసి, త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత స‌న్నాహ‌లు చేస్తున్నారు..

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్(బుజ్జి) మాట్లాడుతూ " అల్లు శిరీష్ తో నా ట్రావెలింగ్ చాలా బావుంది. చాలా మంచి స్నేహితుడు. త‌న‌కి ఫ్యామిలి అంటే చాలా ఇష్టం. జాయింట్ ఫ్యామిలి వుండాలి. అంతా క‌ల‌సి తీసుకునే నిర్ణ‌యాలు నిల‌బ‌డ‌తాయ‌నే న‌మ్మె వ్య‌క్తి. త‌న వ్య‌క్త‌త్వం గొప్ప‌ది. అదే మా సినిమా. ఫ్యామిలి ఎమెష‌న్స్ కి విల‌వ‌లు ఇవ్వ‌టం మానేసారు ప్ర‌స్తుత యువ‌త‌, ఫ్యామిలి అంటే ప‌క్కింటి వాడి మేట‌ర్ కాదు మ‌న‌ది మ‌న ఫ్యామిలి, మ‌న అనుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌నైనా సింపిల్ గా సాల్వ్ చేయ‌చ్చు. ప్ర‌తి ఫ్యామిలీలో అతి ముఖ్య‌మైన ఘ‌ట్టం పెళ్ళి. పెళ్ళి తరువాత అబ్బాయి కాని, అమ్మాయి కాని ఎంత రెస్పాన్సిబుల్ గా వుండాలో ప‌క్క‌న ఫ్యామిలి వుంటేనే తెలుస్తుంది. కూతుర్ని అత్తారింటికి పంపించిన తండ్రి ఆవేద‌న‌.. పెళ్ళైన కొడుకు భాద్య‌త‌గా వుంటున్నాడో లేదో అనుకునే త‌ల్లి ఆలోచ‌న ఇలా ఓ మంచి ఫ్యామిలి లో అన్ని ఎమెష‌న్స్ క‌లిసి వుంటాయి. అలాంటి అన్ని ఎమోష‌న్స్ ని క‌లిపి శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంలో చూపించాము. శిరీష్ ఎన‌ర్జి సూప‌ర్బ్, లావ‌ణ్య తొ వ‌చ్చే స‌న్నివేశాలు యూత్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి. శిరీష్ పాత్ర‌లో ప్ర‌తి ఓక్క కుర్రాడు త‌న‌ని తాను చూసుకుంటాడు. అంత అంద‌మైన పాత్ర‌లో శిరీష్ అంత‌కు మించి న‌టించాడు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌, రావుర‌మేష్‌, సుమల‌త‌, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి న‌టీన‌టుల‌తో ఈ చిత్రం చేశాము. ప్ర‌తి కేర‌క్ట‌ర్ కి ప్రాముఖ్య‌త వుంటుంది. ప్ర‌తి కేర‌క్ట‌ర్ ఇంకో కేర‌క్ట‌ర్ కి లింక్ వుంటుంది. అంత చ‌క్క‌గా అన్ని కేర‌క్ట‌ర్స్ సెట్ అయ్యాయి. తెర‌పై వీరంద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు వీరంతా రియ‌ల్ రిలేష‌న్స్ అనుకునేలా అంద‌రూ ఇన్‌వాల్వ్ అయ్యి న‌టించారు. మా శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం చివ‌రి షెడ్యూల్ కాశ్మీర్ లో చేస్తున్నాము. దీంతో చిత్రం పూర్త‌వుతుంది. ఆల్‌రెడి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మా 'శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు' చిత్రాన్ని త్వ‌ర‌లోనే తీసుకురావ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాము.తెలుగు ప్రేక్ష‌కులంద‌రూ ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నాము. మా చ‌క్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ కి థ‌మ‌న్.య‌స్‌.య‌స్ సంగీతం అందిస్తున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత అల్లు అర‌వింద్ గారికి నా ధ‌న్య‌వాదాలు."అని అన్నారు..

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. నాకు మెద‌టి నుండి కూడా మంచి చిత్రాలు చేయ్యాలి అనే వుండేది. ఆ ద‌శ‌లోనే మంచి చిత్రాలు చేసాను కూడా, మంచి చిత్రాలు తీస్తున్నావు అని అంటుంటే మ‌న‌సులో చాలా ఆనందంగా వుంటుంది. క‌మ‌ర్షియ‌ల్‌ ఫార్ములాని మిక్స్ చేసి ఓ మంచి ఫ్యామిలి క‌థ‌ని ద‌ర్శ‌కుడు బుజ్జి నాకు చెప్పారు. సినిమా వినొద‌మే కాదు సినిమా ఆలోచించేవిధంగా వుండాలి అని న‌మ్ముతాను. అలాంటి క‌థ మా 'శ్రీర‌స్తు శుభ‌మస్తు.ఈ చిత్రం లో ప్ర‌తి ఓక్క కేర‌క్ట‌ర్ మ‌రో కేర‌క్ట‌ర్ కి రిలేటెడ్ గా వుంటుంది. చిన్న కేర‌క్ట‌ర్ కి కూడా వ్యాల్యూ వుంటుంది. ఓక సీనియ‌ర్ న‌టుల‌తో న‌టిస్తే మ‌న‌లోని కాన్ఫిడేన్స్ లెవెల్ బెట‌ర్ అవుతుంది, అదే ఈ చిత్రంలో రావు ర‌మేష్ గారికి నాకు మ‌ద్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశంలో కానివ్వండి, ఇంకా ఇత‌ర పాత్ర‌ల‌తో న‌టించిన‌ప్పుడు కానివ్వండి. స్క్రీన్ మీద‌ తెలుస్తుంది. లావ‌ణ్య తొ సీన్స్ చాలా నేచుర‌ల్ గా వుంటాయి. కుర్రాళ్ళు విజిల్స్ వేస్తారు. ప్ర‌కాష్‌రాజ్‌, రావుర‌మేష్‌, సుమల‌త‌, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి న‌టీన‌టుల‌తో ఈ చిత్రం చేస్తున్నాము. అంద‌రూ చ‌క్క‌టి ఫ్యామిలి మెంబ‌ర్స్ లా ఇమిడారు. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ కాశ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్నాము. దీంతో షూట్ కంప్లీట్ అవుతుంది. అని అన్నారు

నిర్మాత అల్లు అర‌వింద్ గారు మాట్లాడుతూ .. మా చిత్రం 'శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చివ‌రి షెడ్యూల్ కాశ్మీర్ లో జ‌రుగుతుంది. చక్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా స‌మ్మ‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రైనోడు చిత్రం త‌రువాత మా బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్ర‌మిది.. ద‌ర్శ‌కుడు బుజ్జి చాలా మంచి చిత్రాన్ని తీసాడు. ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ వున్న ఈ చిత్రంలో న‌టీన‌టులంద‌రూ చాలా బాగా న‌టించారు. థ‌మ‌న్ అందించిన ఆడియో సినిమాకి ప్ల‌స్ అవుతుంది. అతి త్వ‌ర‌లో ఆడియో ని ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తాము. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాము. "అని అన్నారు.

న‌టీన‌టులు..
అల్లు శిరిష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర త‌దిత‌రులు న‌టించారు..
శ్రీరస్తు శుభమస్తు
గీతా ఆర్ట్స్ బ్యానర్‌
సంగీతం - తమన్.య‌స్‌.య‌స్‌
యాక్షన్ - రామ్, లక్ష్మణ్
ఆర్ట్ - రామాంజనేయులు
డిఓపి - మని కంతన్
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- నాగ‌రాజు
ఎడిటర్ - మార్తాడ్ కె.వెంకటేష్
నిర్మాత - అల్లు అరవింద్
దర్శకుడు - పరశురామ్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved