pizza
Strawberry in November
You are at idlebrain.com > news today >
Follow Us

30 September 2015
Hyderabad

న‌వంబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న 'స్ట్రాబెరి'

సురేష్ దూడ‌ల స‌మ‌ర్ప‌ణ‌లో సాయిరాం ఆర్ట్స్ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌ఫై త‌మిళంలో ఘ‌న‌విజయం సాధించిన 'స్ట్రాబెరి'. ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. పా విజ‌య్ హీరోగా న‌టిస్తూ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తూ డైరెక్ష‌న్ చేశారు. అవ‌ని మోడి హీరోయిన్‌. స‌ముద్ర‌ఖ‌ని, దేవ‌యాని ప్ర‌ధాన‌పాత్ర‌ధారులు. కామెడి హ‌ర్ర‌ర్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో బేబి అను ఈ సినిమా కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. త‌మిళనాట జ‌రిగిన ఓ యదార్థ ఘ‌ట‌న ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాని తెలుగులో

విడుద‌ల చేయ‌డానికి నిర్మాత పి.సాంబ‌శివారెడ్డి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ...
నిర్మాత పి.సాంబ‌శివారెడ్డి మాట్లాడుతూ త‌మిళంలో స్ట్రాబెరి పేరుతో విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సాధించింది. తెలుగు రైట్స్ కోసం చాలా మంది పోటీ ప‌డ్డారు. మంచి పోటీ మీద హ‌క్కుల‌ను చేజిక్కించుకున్నాం. మా బ్యాన‌ర్లో ఈ సినిమా విడుద‌ల కానుండ‌టం ఆనందంగా ఉంది. బేబి అను, దేవ‌యాని, సముద్ర‌ఖని, పా విజ‌య్‌, అవ‌ని మోడిలు సినిమాలో ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించారు. ఓ య‌దార్థ ఘ‌ట‌న ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం కామెడి హర్ర‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. త‌జ్ నూర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని అక్టోబ‌ర్‌లో ప్లాన్ చేస్తున్నాం. అలాగే సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాని న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి మాట‌లుః రాజశేఖ‌ర్ రెడ్డి, పాట‌లుః శివ‌గ‌ణేష్‌, ఫైట్స్ః రాకీ రాజేష్‌, సంగీతంః త‌జ్‌నూర్‌, కెమెరాః మార వ‌ర్మ‌న్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః అలంక వేణు, నిర్మాతః పి.సాంబ‌శివ‌రెడ్డి, క‌థ‌,స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః పా విజ‌య్‌.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved