pizza
S/o Sathyamurthy success meet at Vizag on 23 April
You are at idlebrain.com > news today >
Follow Us

20 April 2015
Hyderabad

 

అంగరంగ వైభవంగా ఈనెల 23న విశాఖపట్నంలో s/o సత్యమూర్తి థాంక్స్ మీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన చిత్రం 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న అత్య‌ధిక ధియేట‌ర్స్ లొ విడుద‌లైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటించారు. ఈచిత్రం ఓపెనింగ్ డే నే సూప‌ర్‌హిట్ టాక్ ని సాధించ‌డమే కాకుండా రికార్డు క‌లెక్ష‌న్లను రాబ‌ట్టింది. అన్ని ఏరియాల్లో పబ్లిక్ టాక్ తో దూసుకెళ్తోంది. టాలీవుడ్ టాప్ 3 ఓపెనింగ్ గ్రాస‌ర్ గా 's/o స‌త్య‌మూర్తి నిలిచింది. అంతేకాకుండా కర్నాటక తెలుగు చిత్రాల్లో టాప్ 1 గ్రాస‌ర్ గా నిల‌వ‌డం విశేషం. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ క‌లెక్ష‌న్ల రికార్డులు సాధిస్తుంద‌ని ట్రేడ్డ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ ను ప్రేక్షకులతో కలిసి పంచుకోనుంది చిత్ర యూనిట్. ఈనెల 23న విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేయనుంది. గతంలో బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది చిత్రానికి సైతం ఇదే తరహాలో థాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సన్నాఫ్ సత్యమూర్తి చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటుంది.

ఈ కార్యక్రమ విశేషాల గురించి నిర్మాత ఎస్. రాధాకృష్ణ మాట్లాడుతూ.... " స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ తో మా బ్యానర్లో చిత్రీకరించిన 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుద‌లైంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ హిట్ అనే టాక్ విన‌టం చాలా ఆనందంగా వుంది. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు తప్పకుండా థాంక్స్ చెప్పుకోవాల్సిందే. అందుకే ఈనెల 23న విశాఖపట్నంలో భారీ ఎత్తున థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరవుతుంది. అని అన్నారు.

నటీనటులు
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు

సాంకేతిక వర్గం
పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను
ఆర్ట్ - రవీందర్
కెమెరా - ప్రసాద్ మూరెళ్ల
మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్
నిర్మాత - రాధాకృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved