pizza
Sundeep Kishan as Rama Rao in Nakshatram
రామారావు పాత్ర కోసం ఎండ‌లో ప‌రిగెత్తిన సందీప్ కిష‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

4 August 2017
Hyderabad

సినిమా అంటే గ్లామ‌ర్ ప్రపంచం.. సిల్వ‌ర్ స్రీన్ మీద అందంగా క‌నిపించాల‌నేది ప్ర‌తి న‌టుడు కొరుకుంటాడు. దానికోసం ర‌క‌ర‌కాల స్కిన్ టెస్ట్ లు చేయించుకుంటారు. సామాన్య ప్రేక్ష‌కుడికి సినిమా న‌టుడు అంటే తెల్ల‌గా వుండే అంద‌గాడు. కాని ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశి చిత్రాల్లో పూర్తి భిన్నంగా వుంటాయి పాత్ర‌లు, వాటి తీరుతెన్నులు. న‌ట‌న‌కి మాత్ర‌మే ఇంపార్టెన్స్ ఇచ్చేలా ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దుతాడు. న‌టించే వాడు పాత్ర గురించి మాత్ర‌మే ఆలోచించాలి అంటారు. రియ‌ల్‌లైఫ్ లో ఎవ‌రూ మేక‌ప్ లు వేసుకోరు. అలాంటి పాత్ర‌లే చేయిస్తుంటారు కృష్ణ‌వంశి.

సినిమాలో న్యాచురల్ గా కనిపించడం కోసం రకరకాలు ప్రయత్నాలు చేస్తుంటారు తారాగణం. కొందరు తమ చేయబోయే పాత్ర కోసం కసరత్తులు చేస్తూ సన్నడటం లేదా లావు అవ్వడం మాములే. అయితే హీరో సందీప్ కిషన్ మాత్రం నక్షత్రం కోసం విపరీతంగా చెమటోడ్చాడ‌ట‌. దాదాపు సంవత్సరన్నర నుంచి ఈ సినిమా కోసం పనిచేసిన సందీప్ కిషన్, అటు ఇటుగా ఓ 120 రోజులు పాటు ప్రతి రోజు ఎండలో రెండు గంటలు పాటు నిల్చొనేవాడ‌ట‌. రామారావు పాత్ర లో నేచ‌ర‌ల్ క‌ల‌ర్ కావాల‌ని ద‌ర్శ‌కుడు కొరిక మేర‌కు అలానే వుండేవాడ‌ట‌. సందీప్ ఈ చిత్రంలో డార్క్ గా కనిపించేందుకే ఇలా ఎండలో పరుగులెత్తే వాడట.

చిన్న‌ప్ప‌టి నుండి పోలీసుల్ని ద‌గ్గ‌ర నుండి చూసి ప్ర‌జ‌ల కొసం 24 గంట‌లు వారి ప‌డే క‌ష్టాలు చూసి పోలీస్ ని ఓ రోల్ మోడ‌ల్ గా పెట్టుకుని ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అవ్వాల‌నుకునే రామారావు పాత్ర సామాన్య‌డుకి ద‌గ్గ‌ర‌గా వుండాల‌ని ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశి తీర్చిదిద్దారు. ఆయ‌న సృష్టించిన పాత్ర‌కి ప్రాణం పోయటానికి సందీప్ త‌న కృషి తాను చేశాడు. రేపు విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంద‌ని యూనిట్ అంతా న‌మ్మ‌కంతో వున్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved