pizza
స‌క్స‌స్‌ఫుల్ గా 5 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సందీప్ కిష‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

17 April 2015
Hyderabad

2010 లో స్నేహ‌గీతం లో అర్జున్ గా తెలుగు తెర ద్వారా ప్రపంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన సందీప్ కిష‌న్ అంచెలంచెలుగా ఎదిగి తెలుగు హ్రుద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేఖ స్థానాన్ని సంపాయించాడు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా.కె.నాయిడు మేన‌ల్లుడు గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యమ‌య్యినా తన న‌ట‌న‌తో, కామెడి టైమింగ్ తో, ఎన‌ర్జితో తెలుగు తెర‌పై ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మెద‌టి చిత్రం 'స్నేహ‌గీతం 'లో న‌లుగురు లో ఒక‌డిగా నటించినా సందీప్ అంటే గుర్తిండిపోయోలా న‌ట‌న‌లో మెప్పించాడు. త‌న రెండ‌వ చిత్రం 'ప్ర‌స్ధానం' లో చేసి పాత్ర తో తెలుగు డైర‌క్ట‌ర్ల దృష్టిని ఆక‌ర్షించాడు. అంతేకాదు ప్ర‌స్థానం చిత్రం అంటే సందీప్ చేసిన పాత్ర గుర్తోచ్చేలా న‌టించి మెప్పించాడు. త‌రువాత సందీప్ ఎంచుకున్న పాత్ర‌లు చాలా విభిన్నమైనవిగా వున్నాయి. ఏదో వ‌చ్చిన చిత్రం వ‌చ్చిన పాత్ర‌లు చేద్దాం అనేలా కాకుండా త‌ను చేసే ప్ర‌తి పాత్ర ప్రేక్ష‌కుల్లో, త‌న అభిమానుల్లో చిర‌కాలం గుర్తిండిపోయోలా చెయ్యాల‌ని నిర్ణయించుకుని వ‌రుస‌గా 'రొటీన్ ల‌వ్ స్టోరి ', 'గుండెల్లో గోదారి' లాంటి విభిన్న‌మైన చిత్రాలు చేసి మెప్పించాడు. న‌టి ల‌క్ష్మి మంచు స‌ర‌స‌న న‌టించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. న‌టుడుగా త‌ను ఎల్ల‌ప్పుడు న‌ట‌న‌లోని మెలుకువ‌లు నేర్చుకుంటూనే స‌క్స‌స్ బాట‌లో ప‌య‌నించాడు. జెమిని వారు నిర్మించిన వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా ట్రేడ్ లో సందీప్ బిజినెస్ ని మరింత గా పెంచింది.ఆ త‌రువాత వ‌చ్చిన ఢిఫ‌రెంట్ కాన్స‌ప్టె తో చేసిన‌ డి ఫ‌ర్ దొపిడి, డి.కె బోస్‌, జోరు, రా.రా..కృష్ణ‌య్య న‌టుడుగా సందీప్ ని మ‌రో మెట్టు ఎక్కించాయి. ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్ లో బీరువా అనే మ‌రో వైవిధ్య‌భ‌రిత చిత్రం చేసి అంద‌రిని మెప్పించాడు. ఇప్పుడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గా టైగ‌ర్ ని తెర‌కెక్కించాడు. ఇటీవ‌లే ఆడియో విడుద‌ల‌య్యి సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. 'టైగ‌ర్ 'చిత్రం పై అంచ‌నాలు కూడా భారీగా వున్నాయి. అంద‌రి అంచ‌నాలు అందుకునేలా వుండే ఈ చిత్రం ఈ స‌మ్మ‌ర్ లోనే విడుద‌ల‌కి రెడీ అవుతుంది. తెలుగులోనే కాకుండా అటు హీంది లో ' షోర్ ఇన్ ద సిటి' అనే చిత్రం, త‌మిళం లో 'ఏరుడా మ‌హేష్' అనే చిత్రాలు చేసి త‌న మార్కెట్ ని పెంచుకున్నాడు. ఎప్పుడు కొత్తద‌నాన్ని ఆహ్వ‌నించే సందీప్ 'ఏ సైలెంట్ మెలోడి' అనే మూకీ షార్ట్ ఫిల్మ్ ని నిర్మించి కొత్త వారిని ప్రోత్స‌హించాడు. 2015 నాటికి 13 చిత్రాలు చేసి తెలుగు సినిమా ఇండ‌స్ట్రిలో త‌న కంటూ ఓ ఇమేజ్ ని ముఖ్యంగా చిన్ని నిర్మాత‌లకి అండ‌గా నిలిచాడు.

ఈ సంద‌ర్బంగా సందీప్ త‌న సంతోషాన్ని పంచుకుంటూ" స్నేహ‌గీతం చిత్రం తో వ‌చ్చిన నాకు అంద‌రూ స్నేహితులు గా మారారు. తెలుగు ప్రేక్ష‌కుల ఎప్పుడు గొప్ప‌వారు టాలెంట్ వుంటే చాలు ఆద‌రిస్తారు. 5 సంవ‌త్స‌రాలుగా కొత్త‌వారితో చేశాను, సీనియ‌ర్స్ తో చేశాను. అంద‌రూ న‌న్ను ప్రోత్స‌హించిన వారే.. ముఖ్యంగా ప్రేక్ష‌క దేవుళ్శు 5 సంవ‌త్సాలగా నన్ను చూస్తూ వారి ఇంట్లో అబ్బాయిలా నన్ను ఆద‌రిస్తున్నందుకు వారి నా ధ‌న్య‌వాదాలు వారి ఆశిస్సులు నాకు ఎప్పుడూ ఇలానే వుంచుతార‌ని ఆశిస్తున్నాను." అని అన్నారు

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved