pizza
Ramantra Creations 'WWW' To Have A Grand Theatrical Release Under The Presentation Of Suresh Productions
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతున్న రామంత్ర క్రియేష‌న్స్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు`.
You are at idlebrain.com > news today >
Follow Us

24 August 2021
Hyderabad

Popular Cinematographer KV Guhan after delivering a SuperHit '118' is now coming with a Mystery Thriller, 'WWW' (Evaru.. Ekkada.. Enduku..) as his latest film. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi P. Raju Datla is bankrolling this film under Ramantra Creations banner. Teaser and Songs released so far through Aditya Music have garnered superb response and the film is carrying very good buzz among the audience for its unique content. Latest is renowned production house Suresh Productions is onboard to present this film. The entire shooting part has been completed and the film is getting ready to release very soon.

On this occasion..

Star Producer D Suresh Babu said, " I recently watched 'WWW'. It is a very well made thriller with crisp narration and great performances from the actors. It reflects the current COVID situation of the virtual world and related challenges. A cute love story is embedded in it. Audio already seems to be a hit with the audience. We are happy to bring 'WWW' to the theatres."

Producer Dr. Ravi P. Raju Datla said, " We are glad that Suresh Productions is presenting the first film 'WWW' made in our banner Ramantra Creations. We feel this as our first success. I thank Suresh Babu Garu on behalf of our banner. 'WWW' is the first computer screen thriller movie in Telugu. Guhan gari making will be in a new kind of style. Adith Arun and Shivani Rajasekhar gave very subtle performances. Their chemistry stands as one of the major highlights of the film. The film is currently undergoing it's post-production works. We will release the trailer soon. The film will surely score a huge commercial success.

Director KV Guhan said, " 'WWW' film came out very well. We are very happy that this film is getting released through Suresh Productions banner. Adith and Shivani gave very good performances. Technicians gave very good support. This will be a different film in thriller genre."

Arun Adith, Shivani Rajashekar, Priyadarshi, Viva Harsha, Divya, Riyaz Khan, Sathyam Rajesh and others are the principal cast

Presented By: Suresh Productions
Banner : Ramantra Creations
Music : Simon K. King
Editing : Thammiraju
Art: Nikhil Hassan
Dialogues : Mirchi Kiran
Lyrics: Ramajogayya Sastry, Ananth Sriram
Choreography: Prem Rakshith
Stunts: Real Sathish
Costume Designer: Ponmani Guhan
Production Controller: K. Ravikumar
Co-producer: Vijay Dharan Datla
Producer: Dr. Ravi P. Raju Datla
Story, Screenplay, Cinematography & Direction: K V Guhan

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతున్న రామంత్ర క్రియేష‌న్స్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు`.

‘118’ వంటి స‌క్సెస్‌ఫుల్‌ మూవీ త‌ర్వాత ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్యంతో థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకుని సినిమాపై అంఛనాల్ని భారీగా పెంచాయి. ఈ సంద‌ర్భంగా..

స్టార్ ప్రొడ్యూస‌ర్ సురేష్‌బాబు మాట్లాడుతూ - ``రీసెంట్ గా సినిమా చూశాను. క్రిస్పీ న‌రేష‌న్‌తో మంచి పెర్‌ఫామెన్స్‌ల‌తో చాలా థ్రిల్లింగ్ గా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్ని, ఈ క‌రోనా వ‌ల్ల వర్చువల్ వరల్డ్ లో వ‌చ్చిన మార్పుల‌ని చ‌క్క‌గా చూపించారు. అంత‌ర్లీనంగా ఒక మంచి ప్రేమ‌క‌థ కూడా ఉంది. ఆడియోకి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది``అన్నారు.

చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ - ``మా బేన‌ర్‌లో రూపొందిన ఫ‌స్ట్ మూవీ `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` చిత్రానికి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాం. ఈ సందర్భంగా సురేష్ బాబుగారికి మా బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్‌ మూవీ ఇది. గుహ‌న్‌గారి మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. అలాగే అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్ద‌రు సెటిల్డ్ పెర్‌ఫామెన్స్ ఇచ్చారు. వారిద్ద‌రి కెమిస్ట్రి త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. త్వ‌రలో ట్రైల‌ర్ రిలీజ్ చేయనున్నాం. క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కేవీ గుహన్ మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వ‌చ్చింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ విడుద‌ల‌వ‌డం నిజంగా హ్యీపీగా ఉంది. అదిత్‌, శివాణి ఇద్ద‌రు చాలా బాగా న‌టించారు. టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి స‌పొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది`` అన్నారు.

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి...
స‌మ‌ర్ఫ‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
బ్యానర్‌: రామంత్ర క్రియేషన్స్
కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్
నిర్మాత: డా. రవి పి.రాజు దాట్ల
కో–ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల
సంగీతం: సైమన్‌ కె. కింగ్
ఎడిటింగ్‌: తమ్మిరాజు
ఆర్ట్‌: నిఖిల్‌ హాసన్
డైలాగ్స్‌: మిర్చి కిరణ్
లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కొరియోగ్రఫి: ప్రేమ్‌ రక్షిత్
స్టంట్స్‌: రియల్‌ సతీష్
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పొన్మని గుహన్
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కె. రవి కుమార్

 

 

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved