pizza
Suresh productions to release Amrutharamam
‘అమృతరామమ్’ కు అండగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 October, 2019
Hyderabad

మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు బ్రాండింగ్ ని ఇస్తూ చిన్న ప్రయత్నాలకు చేయుతగా నిలబడిన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్..పెళ్ళి చూపుల నుండి కంచెరపాలం వరకూ చాలా మంచి సినిమాలు వారి చేతుల మీదుగా ప్రేక్షకలను అలరించాయి. తాము ఎదగడమే కాకుండా తమ ఎదుగుదల పదిమందికి బలంగా మార్చడం తెలిసిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ను రంజిపజేసిన చిత్రం ‘అమృతరామమ్’ ప్రేమను ఒక టైం పాస్ గా చూసే కమర్షియల్ టైం లో ఒక స్వచ్ఛమైన ప్రేమ యెక్క గాఢతను తెరమీదకు తెచ్చిన ప్రేమకథకు తన అండదండలను అందించింది సురేష్ ప్రొడక్షన్స్. ఇప్పటికే ఎన్నో చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆయన ఇప్పుడు అమృతరామమ్‌ అనే చక్కటి ప్రేమకథా చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ఇటీవలనే నిర్మాత మధుర శ్రీధర్‌ రిలీజ్‌ చేయగా మంచి రెస్పాన్స్‌ సంపాదించుకుంది. రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సినిమావాలా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సురేందర్‌ కొంటాడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమలోని స్వచ్ఛతను చూపించబోతున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి నిర్మాత ఎస్‌ఎన్ రెడ్డి. చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా రూపొందించామని నిర్మాత చెప్పారు. ఆస్ట్రేలియా అందాలతో పాటు హీరోయిన్‌ అమిత రంగనాథ్‌ నటన ఆకట్టుకుంటాయని తెలిపారు. సంగీత దర్శకుడు ఎన్‌ఎస్‌ ప్రసు స్వరపరచిన పాటలు త్వరలోనే ఆడియో ద్వారా విడుదల కానున్నాయి. ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస్‌, సినిమాటోగ్రఫర్‌గా సంతోష్‌ శానమోని పని చేయగా, చైతన్యప్రసాద్‌, మధుసూదన్‌ రామదుర్గం, కృష్ణ చైతన్య పాటలను రాశారు.

నటీ నటులు:
హీరో: రామ్ మిట్టకంటి
హీరోయిన్: అమిత రంగనాథ్‌
శ్రీజిత్ గంగాధర్
ఎమిలి మార్టిన్
సారా జోన్స్
శుక్రుతి నారాయణ్
చెరుకూరి జగదీశ్వర్‌రావ్
వంశీ దావులూరి

సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్ డైరెక్టర్: ఎన్ ఎస్ ప్రసు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
పిఆర్వో : జిఎస్ కె మీడియా
సినిమాటోగ్రఫీ: సంతోష్  శానమోని
రచన-దర్శకత్వం: సురేందర్ కొంటాడ్డి
నిర్మాత: యస్ ఎన్ రెడ్డి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved