pizza
TANA 2013 Election Results as of now
You are at idlebrain.com > news today >
Follow Us

డల్లాస్, టెక్సాస్: అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2013-15 కార్యవర్గ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన అభ్యర్ధుల ఫలితాలు సోమవారం నాడు విడుదల అయ్యాయి. కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జంపాల చౌదరి, కార్యదర్శిగా వేమన సతీష్, కోశాధికారిగా తాతా మధు, సహాయ కార్యదర్శిగా కొల్లా సుబ్బారావు, బోర్డ్ ఆఫ్ డైరక్టర్లుగా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, వలివేటి బ్రహ్మాజీ, "తానా ఫౌండేషన్" ట్రస్టీలుగా తాళ్లూరి జయశేఖర్, కోయ హరీష్, ప్రాంతీయ సమన్వయకర్తలుగా గుడిసేవ విజయ్ (క్యాపిటల్), పొట్లూరి రవి (మిడ్-అట్లాంటిక్, యలమంచిలి రావు (న్యూ ఇంగ్లాండ్), పెద్దిబోయిన జోగేశ్వరరావు (నార్త్), మహిధర్ రెడ్డి (నార్త్‌వెస్ట్), బల్ల భక్త(వెస్ట్), లింగమనేని అనిల్ (కెనడా)లు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు తానాఅధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ గుండవరం పాపారావులు సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుత తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర నుండి, ప్రస్తుత కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడి గా ఉన్న మోహన్ నన్నపనేని 2013 జూన్ నుండి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 2015 జూలై వరకు తానా అధ్యక్షుడి గా కొనసాగుతారు.

ఆ తర్వాత ఇప్పుడు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ జంపాల చౌదరి 2015 జూలై లో తానా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 32 సంవత్సరాల తరువాత మొదటిసారిగా తానా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరగటం ఈ ఎన్నికల ప్రత్యేకత. ఇంతటి అరుదైన గౌరవం, అవకాశం తనకు కలిగించినందుకు తానా సభ్యులకు డాక్టర్ జంపాల చౌదరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానాకోసం, తానా సభ్యుల సంక్షేమం కోసం, తెలుగు వారందరికోసం, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తికోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని డాక్టర్ జంపాల చౌదరి మాట ఇచ్చారు. తెలుగు సాహిత్యాభిమానిగా, పత్రికా సంపాదకునిగా తెలుగువారందరికీ సుపరిచితులైన డాక్టర్ జంపాల చౌదరి వృత్తిరీత్యా మానసిక వైద్యులు. చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా తానాకు పలువిధాలుగా సేవ చేసిన డాక్టర్ జంపాల చౌదరి, ఎన్నికల ప్రక్రియలు ప్రారంభం అయ్యేంతవరకు తానా పాలకమండలికి ఛైర్మన్‌గా పనిచేశారు. తానా ప్రచురణలు, అంతర్జాలంలో తెలుగు నిఘంటువులు, టీంస్క్వేర్ భద్రతా సూత్రాలు వంటి అనేక తానా కార్యక్రమాలలో డాక్టర్ జంపాల చౌదరి ముఖ్యపాత్ర వహించారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved