pizza
Tanish’s Sarihaddu
‘సరిహద్దు’ సైనికుడుగా తనీష్
You are at idlebrain.com > news today >
Follow Us

15 January 2019
Hyderabad

మనిషికి, మనిషికీ.. దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంత వరకూ అవి సరిగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే సంఘర్షణ మొదలవుతుంది. దేశాలు, ప్రాంతాల మధ్య ఈ సరిహద్దు సంఘర్షణలు తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు.. ఒక్కోసారి అది జాతీయ సమస్యగానూ మారొచ్చు.. అలా మారకుండా చూసే శక్తి ఆర్మీ. సైనికుడు సరిహద్దుకు కాదు దేశానికే రక్షకుడు. ఇదే కాన్సెప్ట్ తో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తనీష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తనీష్ గత సినిమా రంగుతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న కార్తికేయ ఈ చిత్రానికి దర్శకుడు. అంటే రంగు కాంబినేషన్ రిపీట్ అవుతోందన్నమాట. నేషనలైజ్డ్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ కూడా ‘సరిహద్దు’.

ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ "
భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని...ప్రతి భాషకు ఒక "తెగ "అనీ...కొన్ని తెగలకు ఒక "కులం "అనీ.. కొన్ని కులాలు కలసి ఒక "మతం" అనీ విడిపోతూ
మృగలనుండి మనుషులుగా.. మనుషులనుండి "తెగలుగా" ...
తెగలనునుండి.."కులాలుగా"..కులాలనుండి "మతాలుగా"....
మతాలనుండి "రాష్ట్రాలుగా"....
రాష్ట్రాలనుంచి "దేశాలుగా"..సరిహద్దుల్ని గీసుకొంటూ...బతుకుతున్నాం.
ఈ కాన్సెప్ట్ తో సరిహద్దు రూపొందబోతుంది " అన్నారు.

దర్శకుడు కార్తికేయ, హీరో తనీష్ ‘రంగు’ సినిమాతో అద్భుతమైన ప్రశంసలు అందుకున్నారు. అందుకే మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ సారి అంచనాలు కూడా ఉంటాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఓ అద్భుతమైన కథతోనే మళ్లీ వస్తున్నారు ఈ ఇద్దరు. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు’ మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతోంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రంలో తెలుగుతో పాటు హిందీ భాషా నటులు కూడా నటిస్తారు. ప్రస్తుతం టైటిల్ తోనే విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ టీమ్.. సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన వివరాలను ఈ నెలాఖరులో తెలియజేయబోతున్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved