pizza

Director Teja Announces Heroes And Titles Of His Next Two Films
రెండు కొత్త సినిమాల టైటిళ్లనూ, హీరోలనూ ప్రకటించిన డైరెక్టర్ తేజ

You are at idlebrain.com > news today >
Follow Us

22 February 2020
Hyderabad

Director Teja celebrates his birthday today. On the special occasion, he proclaimed titles and heroes of his next two films. Gopichand and Rana will associate with Teja for one film each.

Teja registered the titles Rakshasa Raju Ravanasurudu and Alimelu Manga Venkata Ramana for these films. However, interest aspect here is Teja released the posters without mentioning names of anybody including heroes. So, for now, it is uncertain, which project Rana and Gopichand will do among these two?

Teja is expected to announce producers and other cast of the film very soon. He has already completed writing script for these films.

It is known that, Teja gave biggest break for Gopichand with Jayam and he provided a memorable hit to Rana with Nene Raju Nene Mantri.

రెండు కొత్త సినిమాల టైటిళ్లనూ, హీరోలనూ ప్రకటించిన డైరెక్టర్ తేజ

దర్శకుడు తేజ శనివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు.

ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు.

ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు.

'జయం' చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు మరపురాని హిట్ ను అందించిన విషయం గమనార్హం.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved