pizza
Tejaswi Madivada about Babu Baga Busy
ఇమిటేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను - తేజ‌స్వి మ‌డివాడ‌
You are at idlebrain.com > news today >
Follow Us

02 May 2017
Hyderabad

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం `బాబు బాగా బిజీ`. బాలీవుడ్ హిట్ చిత్రం `హంటర్‌` చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ తేజస్విని మ‌డివాడ సినిమా గురించిన సంగ‌తుల‌ను పాత్రికేయుల‌కు తెలియ‌జేసింది.

Tejaswi Madivada Glam gallery from the event

తేజ‌స్విని మ‌డివాడ మాట్లాడుతూ - ```బాబు బాగా బిజీ` ఒక జ‌ర్నీలాగా అనిపించిన సినిమా. ఏడాదిగా ఈ సినిమా ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే హిందీలో అల్రెడి చేసిన సినిమా. రీమేక్ చేస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయాల‌నే బాధ్య‌త ఉంటుంది. తెలుగు నెటివిటీకి అనుగుణంగా సినిమా చేయ‌డ‌మంటే చిన్న విష‌యం కాదు. అవ‌స‌రాల శ్రీనివాస్‌, అభిషేక్‌, ద‌ర్శ‌కుడు న‌వీన్ మేడారం స‌హా అంద‌రికీ థాంక్స్‌. ఈ సినిమాలో స్విమ్మ‌ర్ పాత్ర‌లో న‌టించాను. ఎప్ప‌టికీ న‌టించిన రోల్‌. సైలెంట్‌గా ఉండే అమ్మాయిగా క‌నిపిస్తాను. ఈ సినిమాలో స్పైసీ డైలాగ్స్‌, సీన్స్ కానీ ఏమీ లేవు. కాలేజ్ టైం గ‌ర్ల్ ఫ్రెండ్ రోల్‌లో క‌న‌ప‌డ‌తాను. అవ‌స‌రాల చాలా మంచి కోస్టార్‌. సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ క‌న‌ప‌డ‌తారు. ప్ర‌తి ఒక్క‌రికీ స‌మాన‌మైన ప్రాధాన్య‌త ఉంటుంది. హిందీలో నా రోల్‌లో చేసిన అమ్మాయి పాత్ర చూసి తొలిసారి ఒక పాత్ర‌ను ఇమిటేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను. అభిషేక్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ చాలా మంచి నిర్మాణ సంస్థ‌. అభిషేక్ నాకు మంచి మిత్రుడుగా మారిపోయాడు. తెలుగులో ఇప్పుడు బాబుబాగా బిజీ త‌ర్వాత మ‌రే సినిమా చేయ‌లేదు. నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ వెబ్ సిరీస్‌లో న‌టించడానికి రెడీ అయ్యాను. నందినీ రెడ్డి రాసే అమ్మాయిల పాత్ర చాలా బావుంటాయి. అలాంటి పాత్ర‌లు నాకు కూడా ఇష్ట‌మే. అందుక‌నే ఈ వెబ్‌సిరీస్‌లో చేయ‌డానికి అంగీక‌రించాను`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved