
                          14 January -2021
                            Hyderabad
                          
                         
                          Sri Simha Koduri, Manikanth Gelli, Vaaraahi Chalana Chitram and Loukya Entertainments Thellavarithe Guruvaram First Look Out
                          Made impressive debut with Mathu Vadalara, Music director MM Keeravani’s son Sri Simha Koduri is doing Thellavarithe Guruvaram as his second film and the film’s first look poster is dropped on the occasion of Sankranthi.
                          Sri Simha Koduri is known to be a load of talent and his thirst for offering new kind of films was understood with Mathu Vadalara. Now, Thellavarithe Guruvaram is also a new kind of title and the poster with Sri Simha in groom getup hints more about the film. Chitra Shukla and Misha Narang are the heroines paired along side Sri Simha Koduri.
                          First timer Manikanth Gelli has wielded megaphone. It’s a Sai Korrapati Production from Vaarahi Chalana Chitram and Loukya Entertainments bankrolled jointly by Rajani Korrapati and Ravindra Benerjee Muppaneni.
                          Loukya Entertainments recently delivered a super hit in lockdown with Colour Photo.
                          Kaala Bhairava who’s proving to be a promising music composer in the lines of MM Keeravani has scored tunes for this also which is all set for March 2021 release. Film’s shooting is currently in progress.
                          Cast: Sri Simha Koduri, Misha Narang, Chitra Shukla, Rajeev Kanakala, Satya, Ajay, Viva Harsha, Sharanya Pradeep, Giridhar, Priya, Ravi Varma, Parvathi, Siri Hanumanth, Mourya, Padmavathi
                          Crew:
                            A Sai Korrapati Production
                            Banners: Vaaraahi Chalana Chitram & Loukya Entertainments
                            Producers: Rajini Korrapati & Ravindra Benerjee Muppaneni
                            Director: Manikanth Gelli
                            Music: Kaala Bhairava
                            Cinematography: Suresh Ragutu
                            Writer: Nagendra Pilla
                            Editor: Satya Giduturi
                            Lyrics: Kittu Vissapragada, Raghuram, Krishna Vallepu
                            PRO: Vamsi-Shekar
                          శ్రీసింహా కోడూరి, మణికాంత్ గెల్లి, వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ 'తెల్లవారితే గురువారం' ఫస్ట్ లుక్ విడుదల
                          సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు, 'మత్తు వదలరా' చిత్రంతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న శ్రీసింహా కోడూరి నటిస్తోన్న రెండో చిత్రం 'తెల్లవారితే గురువారం'. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
                          'మత్తు వదలరా' భిన్నతరహా చిత్రంగా పేరు తెచ్చుకోగా, ఆ చిత్రంలో ప్రదర్శించిన అభినయంతో శ్రీసింహా ప్రతిభావంతుడైన నటునిగా అందరి ప్రశంసలూ పొందారు.
                          ఇప్పుడు 'తెల్లవారితే గురువారం' లాంటి మరో కొత్త తరహా చిత్రాన్ని ఆయన చేస్తున్నారు. టైటిల్ ఎంత విలక్షణంగా ఉందో, పోస్టర్‌ను అంత ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో పెళ్లికొడుకు గెటప్‌లో మహారాజా కుర్చీలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ కనిపిస్తున్నారు శ్రీసింహా. ఆయన చేతిలో పెళ్లి దండ కూడా ఉంది.
                          శ్రీసింహా సరసన నాయికలుగా చిత్రా శుక్లా, మిషా నారంగ్ నటిస్తున్నారు.
                          ఈ చిత్రంతో మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి కొర్రపాటి సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
                          'కలర్ ఫొటో'తో లాక్‌డౌన్‌లో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సూపర్ హిట్‌ను అందించింది.
                          తండ్రి ఎం.ఎం. కీరవాణి తరహాలో బాణీలు కడుతూ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్న కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది. మార్చి నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
                          తారాగణం:
                            శ్రీసింహా కోడూరి, మిషా నారంగ్, చిత్రా శుక్లా, రాజీవ్ కనకాల, సత్యా, అజయ్, వైవా హర్ష, శరణ్యా ప్రదీప్, గిరిధర్, ప్రియ, రవివర్మ, పార్వతి, సిరి హనుమంత్, మౌర్య, పద్మావతి.
                          సాంకేతిక బృందం:
                            బ్యానర్స్: వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
                            నిర్మాతలు: రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
                            దర్శకత్వం: మణికాంత్ గెల్లి
                            మ్యూజిక్: కాలభైరవ
                            సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
                            రచన: నాగేంద్ర పిళ్లా
                            ఎడిటింగ్: సత్య గిడుతూరి
                            పాటలు: కిట్టు విస్సాప్రగడ, రఘురామ్, కృష్ణ వల్లెపు
                            పీఆర్వో: వంశీ-శేఖర్.