pizza
TELUGU FILM PRODUCERS COUNCIL
You are at idlebrain.com > news today >
 
Follow Us

24 November -2020
Hyderabad

థియేటర్లు రీ-ఓపెనింగ్‌ చేసుకునేలా జీవో ఇవ్వడంతో పాటు సినీ ఇండస్ట్రీకి లాభం చేకూర్చేలా పలు నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీ తరపున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు చెబుతోంది.

చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇచ్చినందుకు, థియేటర్లు ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు, సినిమా టికెట్ల ధరను రూ.50 నుంచి రూ.250 వరకు నిర్ణయించుకునేందుకు నిర్మాతలకు అధికారం ఇచ్చినందుకు, సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చినందుకు తెలుగు సినీ నిర్మాతల మండలి నుంచి ప్రెసిడెంట్ సీ.కల్యాణ్ గారు, సెక్రటరీలు పసన్నకుమార్ గారు, మోహన్ వడ్లపట్ల గారు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.

ఇది జరిగేలా తీవ్రంగా కృషి చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జునకు కృతజ్జతలు.

అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇతర డిపార్ట్‌మెంట్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నాం.

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము.

 

    
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved