pizza
Telugu films shine at national arena
You are at idlebrain.com > news today >
Follow Us

9 August 2019
Hyderabad

Four Telugu films have bagged seven awards cumulatively at National level. National awards 2919 were announced a while ago. Mahanati has bagged three awards. Awe bagged 2 awards. Rangastalam and Chi La Sow bagged one award each. here is the list

Best Actress: Keerthy Suresh for Mahanati
Best Telugu film: Mahanati
Best Original Screenplay: Chi La Sow
Best mixed track: Rangastalam
Best Make Up artist: Awe
Best Costume: Mahanati
Best spl effects: Awe

Kannada film #KGF chapter one wins 2 national awards. One for best action direction and another for best special effects (shared with Telugu film #Awe)! This film has done well commercially in Telugu and Hindi Languages as well.

Telugu cinematographer Sudhakar Reddy Yakkanti who made his directorial debut with Naal (Marathi) film has won best debut director at National awards!

we would like to congratulate all these filmmakers and technicians for making Telugu cinema fly high at national level.

మెగాస్టార్ చెప్పిన‌ట్లే జ‌రిగింది!
జాతీయ అవార్డు విజేత‌ల‌కు మెగాస్టార్ శుభాకాంక్ష‌లు!

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, చి`లసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ మ‌హాన‌టి ఖాతాలో అవార్డులు చేరాయి. ఇక నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `రంగ‌స్థ‌లం` బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి ఎంపికైంది. బెస్ట్ ఒరిజిన‌ల్ స్ర్కీన్ ప్లే నుంచి చిల‌సౌ కు, `అ` చిత్రానికి గాను ఉత్తమ మేకప్ , ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు ద‌క్కాయి.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. `మ‌హాన‌టి`, `రంగ‌స్థ‌లం` చిత్రాల‌కు జాతీయ అవార్డ‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న‌ రిలీజ్ కు ముందుగానే చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌హాన‌టి రిలీజ్ అనంత‌రం చిరంజీవి యూనిట్ స‌భ్యుల‌ను ఇంటికి పిలిపించి ఘ‌నంగా స‌న్మానించిన సంగ‌తి విధిత‌మే. నాటి ఆయ‌న వాక్కులు నేడు ఫ‌లించ‌డంతో సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం`కు జాతీయ అవార్డు రావ‌డం. అలాగే ఇత‌ర భాష‌ల నుంచి అవార్డ‌ల‌కు ఎంపికైన వారంద‌రికీ మెగాస్టార్ అభినంద‌న‌లు తెలిపారు.

జాతీయ అవార్డ్ రావడం చాలా హ్యాపీగా ఉంది : రాహుల్ రవీంద్రన్

సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్‌పై సుశాంత్, రుహానీ శర్మ హీరో హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `చి.ల.సౌ`. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేసింది. గత ఏడాది ఆగస్ట్‌లో సినిమా విడుదలైంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం గత ఏడాది చాలా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా...

రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - ``మా చి.ల.సౌ` చిత్రానికి బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. ఈ సందదర్భంగా అమ్మానాన్నకు, నా భార్య చిన్మయికి, నా సోదరుడికి థ్యాంక్స్ చెబుతున్నాను. నేను ఉద్యోగం వదిలేసి వచ్చి సినిమాల్లో ప్రయత్నిస్తానని చెప్పగానే వాళ్లు ఎంకరేజ్ చేశారు. సపోర్ట్ అందించారు. నేషనల్ అవార్డ్ జ్యూరీకి స్పెషల్ థ్యాంక్స్. చిన్న సినిమా తీశామని నేను అవార్డ్ కోసం సినిమాను పంపాం ..మరచిపోయాం. కానీ ఇప్పుడు అవార్డ్ రావడం మరచిపోలేని ఆనందాన్ని ఇస్తుంది. సుశాంత్ ఈ సినిమా కథను నమ్మడంతో జర్నీ స్టార్ట్ అయ్యింది. అలాగే రుహాని శర్మ, సిరుని సినీ కార్పొరేషన్ అధినేతలు సహా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. అలాగే రిలీజ్ సమయంలో నాగ్ గారు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. అదే మాకు పెద్ద ప్లస్ అయ్యి సినిమా రీచ్ పెరిగింది. మాతో పాటు చాలా తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చాయని విన్నాం. ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్. తెలుగు సినిమాకు ఇది గొప్ప ఏడాది. తెలుగు సినిమాతో పాటు అవార్డులను అందుకున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను`` అన్నారు.

కేజీఎఫ్‌కు రెండు జాతీయ అవార్డులు
-జ్యూరీకి యూనిట్ ధన్యవాదాలు


కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘కేజీఎఫ్’ రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన 66వ జాతీయ చలన చిత్రా అవార్డుల్లో.. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ కేటగిరిల్లో ‘కేజీఎఫ్’కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. జ్యూరీ సభ్యులకు హీరో రాక్‌స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. యూనిట్ సభ్యులందరి సమిష్టి కృషితోనే ఈ అవార్డులు వరించాయని చెప్పారు. కేజీఎఫ్ చాప్టర్2ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved