pizza
Terrific response for Arjun’s Kurukshetram movie teaser
యాక్షన్ కింగ్ అర్జున్ ‘‘కురుక్షేత్రం’’ మూవీ టీజర్ కు రెస్పాన్స్ అదుర్స్
You are at idlebrain.com > news today >
Follow Us

28 June 2017
Hyderabad

Action King Arjun’s 150th film Kurukshetram is making waves on the internet. The film’s teaser has got more than 2 million digital views in just three days and the buzz for this dubbed film has surprised quite a few. Already, a lot of people have been making business enquiries about the film, according to the latest reports in Filmnagar.

Arjun will be seen playing a talented investigative officer, who’s given a complex case to solve the mystery of a serial killer. Over the years, Arjun has established himself as an action star and his films like “Gentleman”, “Oke Okkadu”, “Jai Hind” among many others have made him a household name. Now, after seeing the teaser of Kurukshetram, there’s no denying that he’s going to be back with a bang in what looks like a Hollywood-style Action Crime thriller.

Directed by Arun Vaidyanathan, the film also stars Prasanna, Varalaksmi Sarathkumar, Vaibhav, Sruthi Hariharan among many others. Currently, the film is in post-production stage and it’s gearing up for July release in Telugu, Tamil and Kannada. While the Telugu version is titled Kurukshetram, the film has been titled as Nibunan in Tamil, and Vismaya in Kannada.

Naveen has scored the music and Arvind Krishna is the cinematographer. Sateesh Surya is the editor of this crime thriller. PL Arul Raj is the co-producer and Passion Studios has produced the film. Arun Vaidyanathan has directed the film.

యాక్షన్ కింగ్ అర్జున్ ‘‘కురుక్షేత్రం’’ మూవీ టీజర్ కు రెస్పాన్స్ అదుర్స్

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ప్రతిష్టాత్మక 150వ సినిమా కురుక్షేత్రం టీజర్ డిజిటల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేవలం 3 రోజుల్లోనే 2 మిలియన్ డిజిటిల్ వ్యూస్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది..ఓ డబ్బింగ్ సినిమా టీజర్ కు అన్ని వర్గాల నుంచి ఇంతటి రెస్పాన్స్ వస్తుండటం విశేషం..అంతేకాదు టీజర్ ప్రామిసింగ్ గా వుండటంతో సినిమా బిజినెస్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఫిలింనగర్ లో.. కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కురుక్షేత్రంలో ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకునే మోస్ట్ టాలెంటెడ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించాడు అర్జున్. యాక్షన్ కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ యూట్యూబ్ లో ఆడియన్స్ పాజిటివ్ కామెంట్స్ చూస్తుంటే అర్జున్ కు తెలుగులో కూడా అద్భుతమైన క్రేజ్ ఉందని మరోసారి ప్రూవ్ అయ్యింది.

కేవలం 3 రోజుల్లోనే 20 లక్షల డిజిటల్ వ్యూస్ సంపాదించి సోషల్ మీడియాలో శరవేగంగా స్ప్రెడ్ అవుతోంది.. టీజర్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ స్టైలిష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ తమిళంలో ‘‘నిబునన్’’, కన్నడలో ‘‘విస్మయ’’ పేరుతో ఏకకాలంలో జులై నెలలో రిలీజ్ కానుంది..అరుణ్ వైద్యనాథన్ డైరెక్ట్ చేస్తోన్న కురుక్షేత్రం సినిమా తన కెరీర్ లో ది బెస్ట్ పోలీస్ మూవీగా నిలుస్తుందని అర్జున్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు..సో.. చాలా రోజుల తర్వాత అర్జున్ నుంచి మరో మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నాం అన్నమాట.

యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ప్రసన్న, వైభవ్, వరలక్ష్మి శరత్ కుమార్, సుమన్, సుహాసిని, , శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతిక నిపుణులు : సంగీతం : నవీన్, సినిమాటోగ్రఫీ : అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ : సతీష్ సూర్య, కో-ప్రొడ్యూసర్-పి.ఎల్. అరుల్ రాజ్, నిర్మాణం : ప్యాషన్ స్టూడియోస్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అరుణ్ వైద్యనాథన్..

 


 Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved