pizza
Terrific response to 'Khakee' audio album 
`ఖాకి` పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 November 2017
Hyderabad

'Khakee' music album has been getting a terrific response from music lovers. The album is a mix of different genres and it sets the mood right for the movie. It hints at how the film is going to be. The songs have turned out to be instant hits.  

Ghibran, known for his variety and experimentation with different sounds and instruments, has come up with an album, which caters to all the sections of the audience. While 'Aduge Pidugu Athade Godugu' song hints about the hero's characterization, 'Kallabolli Pilla' is being loved by all those who are in love. 'Chinni Chinni Aasalevo' is a pleasant song, which is being listened to in a repeat mode and you will sure go fidaa over 'Tholi Vayase' song. The energetic 'Tinga Tinga' song has been a hit with the music lovers of all the ages. 

The songs, which have been released through Aditya Music, have turned out to be chartbusters. H Vinoth, who earlier directed a super hit film like 'Sathuranga Vettai' in Tamil, is the director of this movie. Umesh Gupta and Subhash Gupta of Aditya Music Pvt Ltd are bringing the film to the Telugu audiences. 

The film is going to have a big release in Telugu and Tamil on 17th November. 

`ఖాకి` పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న‌

అన్నం ఉడికిందో లేదో చెప్ప‌డానికి ఒక్క మెతుకు ప‌ట్టుకుని చూస్తే చాలు అని అంటారు. పెళ్లి ముందు జ‌రిగే నిశ్చితార్థాన్ని బ‌ట్టి పెళ్లి ఎంత ఘ‌నంగా ఉండ‌బోతోందో అంచ‌నా వేయొచ్చంటారు. అదే సినిమా భాష‌లో అయితే సినిమా ఎలా ఉండ‌బోతోందో పాట‌ల‌ను బ‌ట్టి చెప్పేయొచ్చు. ఆడియో జ్యూక్ బాక్స్ ని బ‌ట్టి ఆ సినిమా ఎంత హుషారుగా, ఎంత వైవిధ్యంగా ఉండ‌బోతోందో అంచ‌నాకు వ‌చ్చేయ‌వ‌చ్చు. పెళ్లికి ముందు జ‌రిగే నిశ్చితార్థం లాంటిద‌న్న‌మాట సినిమాలోని పాట‌ల వేడుక‌. `ఖాకి` పాట‌లు వేడుక గ్రాండ్‌గా జ‌రిగింది. అందులోని పాట‌లు కూడా ప్ర‌జ‌ల నాలుక‌ల మీద నాట్య‌మాడుతున్నాయి. 

కార్తి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన సినిమా ఇది. హెచ్ .వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ఈ నెల 17న తెలుగు, త‌మిళంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈచిత్రాన్ని `ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అధినేత  ఆదిత్యా ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. 

`ఖాకి` చిత్రంలో ఒక్కో పాటా ఒక్కో విధంగా అంద‌రినీ అల‌రిస్తోంది. సంగీత ప్రియులనే కాదు, పామ‌రుల‌ను సైతం మెప్పించే అన్ని ర‌కాల పాట‌లూ ఇందులో చేరాయి. `అడుగే పిడుగు అత‌డే గొడుగు..` అనే పాట విన‌గానే ఒక వ్య‌క్తి తాలూకు వ్య‌క్తిత్వాన్ని అత‌నిలోని క‌సిని, సామ‌ర్థ్యాన్ని చెప్ప‌క‌నే చెబుతుంది. దాని వెంట‌నే వినిపించే `క‌ల్ల‌బొల్లి పిల్ల‌నాతో క‌ళ్లు క‌లిపేనా..` పాట‌ను ఒక్క‌సార‌యినా పాడుకోని అబ్బాయి ఉండ‌డేమో. ప్రేమ‌తో ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సునూ త‌ట్టిలేపి పాడుకునేలా చేస్తుంది ఈ పాట‌. అందుకే ఇప్ప‌టికే చాలా మందికి ఫేవ‌రేట్ అయింది. `చిన్ని చిన్ని ఆశ‌లేవో రెక్క విప్పుకున్న‌వి` పాట‌ను వింటుంటే హాయిగా అనిపిస్తుంది. కొత్త అనుభూతికి లోనుచేసే పాట ఇది. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపిస్తుంది. ఇక `తొలి వ‌య‌సే నీలో నాలో కౌగిళ్లై..` పాట విన్న వారందరూ ఫిదా అవుతున్నారు. స్త్రీ, పురుషుల అన్యోన్య‌త‌ను వ్య‌క్తం చేసే పాట ఇది. ఇక ఈ ఆల్బ‌మ్‌లో కుర్ర‌కారుతో పాటు చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రినీ చిందులేయించే పాట `టింగ టింగ టింగ టింగ‌రా...` వినేకొద్దీ వాల్యూమ్ మ‌రింత పెంచుకుని వినాల‌నిపిస్తుంది. ఇలా అన్ని ర‌కాల పాట‌ల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది `ఖాకి` ఆడియో జ్యూక్ బాక్స్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన `ఖాకి` పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన  స్పంద‌న వ‌స్తోంది.


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved