pizza
Thanu Vachenanta release on 21 October
అక్టోబర్ 21 న ప్రపంచ వ్యాప్తంగా “తను వచ్చెనంట” విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

13 October 2016
Hyderaba
d

శ్రీ అచ్యుత ఆర్ట్స్ బేనర్ పై,రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో చంద్ర శేఖర్ ఆజాద్, నిర్మిస్తున్న టాలీవుడ్ మొట్టమొదటి జోంబీ కామెడీ చిత్రం “ తను వచ్చెనంట” నిర్మానంతర కార్యక్రమాలు, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు దిగ్విజయంగా ముగించుకుని సెన్సార్ పూర్తి చేసుకుంది.. అక్టోబర్ 21 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.

చిత్ర నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ, ఇటీవల తమ చత్ర యూనిట్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, భీమవరం, రావులపాలెం మొదలగు ప్రాంతాలలో చేసిన ప్రమోషన్ కార్యక్రమాలకు యూత్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, తప్పక “తను వచ్చెనట “చిత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ తో సక్సెస్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు..తమ చిత్ర యూనిట్ 100% అంకిత భావం తో చేసిన కృషి కి అక్టోబర్ 21 న థియేటర్స్ లో ప్రేక్షకులు తీర్పు పాజిటివ్ తీర్పునే ఇవ్వబోతున్నారని, ప్రేక్షకులు తప్పకుండా త్రిల్ అవుతారని నిర్మాత చెప్పారు..

నిర్మాత మాట్లాడుతూ భీమవరం ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు మా చిత్రం ట్రైలర్ చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త మంతెన రవి రాజు ఈస్ట్, వెస్ట్ జిల్లాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫాన్సీ రేట్ కు తీసేసుకున్నారు. మాకు ఆనందం కలిగింది. అదే విధంగా వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఏపీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సూర్య ఫిలిమ్స్ డి ఎస్ పి టి వర్మ, ఎన్. రాజేష్ వర్మ తీసుకోవటం ఇంకా ఆనందం కలిగింది'' అన్నారు.

కొత్త తరహా కథాంశంతో అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రొటీన్ సినిమా లా కాకుండా, కథ, కథనం చాల ఫ్రెష్ గా ఉంటుందని, సగటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు కలిగివుండి, అటు క్లాసు ని, ఇటు మాస్ ని కూడా మెప్పిస్తుందని దర్శకుడు వెంకట్ కాచర్ల చెప్పారు.

cast and crew as follows
తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యా బాలకృష్ణ, చంటి, శివన్నారాయణ, ఫిష్ వెంకట్, షేకింగ్ శేషు, ఫణి, ప్రధాన తారాగణం.
D.O.P : రాజ్ నల్లి, మ్యూజిక్: రవి చంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శశి ప్రీతం, పాటలు: విజయ లక్ష్మి, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: భార్గవ్ చౌదరి, సహనిర్మాత: ఎశ్వంత్, కథ & నిర్మాత: చంద్ర శేఖర్ ఆజాద్, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: వెంకట్ కాచర్ల.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved