pizza

‘The Warriorr’ is the title of Lingusamy-Ram Pothineni's Tamil-Telugu bilingual
రామ్ పోతినేని - లింగుస్వామి కలయికలో తెరకెక్కుతున్న తెలుగు - తమిళ ద్విభాషా చిత్రానికి 'ది వారియర్' టైటిల్ ఖరారు

You are at idlebrain.com > news today >
Follow Us

17 January 2022
Hyderabad

Hitherto known as RAPO19, the title of ace director N Lingusamy's upcoming Tamil-Telugu bilingual starring Ustaad Ram Pothineni has been revealed.

Along with a poster that features Ram Pothineni as a police officer wielding a gun with a tough look and with cops surounding him, the title of the movie has been unveiled as ‘The Warriorr’.

The poster has been designed in such a way that it triggers a lot of curiosity about the subject. Cop stories are always loved by the audience. With Ram donning the khaki for the first time that too in the combination of Lingusamy, who is known for his gripping entertainers, a lot of expectations are riding on The Warriorr.

According to the movie's team, the film will surpass the anticipations and will be one of the memorable police stories of south Indian cinema. The Warriorr comes after the success of iSmart Shankar of Ram Pothieni. A fresh schedule shoot of The Warriorr has commenced in which crucial scenes are being shot.

Aadhi Pinisetty, who is popular in both Kollywood and Tollywood, plays the antagonist and his character will be talked about. The film has Krithi Shetty, one of the happening actresses of the south, as heroine, while Akshara Gowda will be seen in an important role.

Produced by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screen banner, The Warriorr is expected to be a feather in the production house's hat after the success of its recent sports drama Seetimaar, which had Gopichand and Tamannah Bhatia in lead roles.

The action drama will be presented by Pavan Kumar and it is a Devi Sri Prasad musical. The earlier schedules of The Warriorr were shot in many grand scale locations.

రామ్ పోతినేని - లింగుస్వామి కలయికలో తెరకెక్కుతున్న తెలుగు - తమిళ ద్విభాషా చిత్రానికి 'ది వారియర్' టైటిల్ ఖరారు

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో 'ది వారియర్' టైటిల్ ఖరారు చేశారు. రామ్ 19వ చిత్రమిది. సోమవారం టైటిల్ రివీల్ చేయడంతో పాటు రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

రామ్ - లింగుస్వామి కాంబినేషన్... తొలిసారి రామ్ స్ట్రయిట్ తమిళ సినిమా... దర్శకుడు లింగుస్వామి తెలుగు సినిమా చేస్తుండటం... సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. అప్పటి నుంచి సినిమా కథ ఏమై ఉంటుంది? టైటిల్ ఏం పెడతారు? అనే ఆసక్తి పెరిగింది. రామ్ క్యారెక్టర్, కథ గురించి ఈరోజు దర్శకుడు లింగుస్వామి క్లారిటీ ఇచ్చారు.

ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ చూస్తే... పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌ను దర్శకుడు లింగుస్వామి చూపించారు. చేతిలో గన్, టెర్రిఫిక్ ఎక్స్‌ప్రెష‌న్‌, చుట్టూ పోలీసులు... టఫ్ లుక్‌లో రామ్ సూపర్ అని ప్రేక్షకులు అంటున్నారు. తొలిసారి ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు. అదీ లింగుస్వామి దర్శకత్వంలో కావడం... ఇప్పుడీ లుక్, టైటిల్ సినిమాపై‌ అంచనాలను మరింత పెంచాయి.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ... "రామ్ లుక్, టైటిల్ పోస్టర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. అందరిలో‌ అంచనాలు పెరిగాయి. వాటికి మించి సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చేలా... కథ - కథనం పరుగులు పెట్టిస్తూ... సినిమాలు తీయడం లింగుస్వామి స్టైల్. 'ది వారియర్'ను అలాగే‌ తీస్తున్నారు. 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' చిత్రాలను మించిన స్థాయిలో ఈ చిత్రాన్ని లింగస్వామి తీర్చిదిద్దుతున్నారు. ఈ నెలలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాం. ప్రస్తుతం కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు, భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం" అన్నారు.

రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా - లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved