pizza
Detective trailer released
కాజల్‌, సమంత, కీర్తి సురేష్‌, లింగుస్వామి చేతుల మీదుగా
మాస్‌ హీరో విశాల్‌ 'డిటెక్టివ్‌' ట్రైలర్‌ విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

3 October r 2017
Hyderabad

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డిటెక్టివ్‌'. తమిళ్‌లో 'తుప్పరివాలన్‌'గా విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించి విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, 'డిటెక్టివ్‌' ట్రైలర్‌ను అక్టోబర్‌ 2న విడుదల చేశారు. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌, సమంత, కీర్తి సురేష్‌, ప్రముఖ దర్శకుడు ఎన్‌.లింగుస్వామి ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''తమిళ్‌లో 'తుప్పరివాలన్‌' పేరుతో విడుదలై మొదటి వారంలోనే 30 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. విశాల్‌ కెరీర్‌లోనే మొదటివారం హయ్యస్ట్‌ కలెక్షన్‌ సాధించిన చిత్రంగా 'తుప్పరివాలన్‌' రికార్డు స ష్టించింది. 'డిటెక్టివ్‌'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాము. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశాం. తెలుగులో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, అను ఇమ్మానుయేల్‌, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్‌, సిమ్రాన్‌, జాన్‌ విజయ్‌, అభిషేక్‌ శంకర్‌, జయప్రకాష్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్‌ కొరెల్లి, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ వెంకట్రామన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్‌.

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved