pizza
Nani, Shiva Nirvana, Shine Screens Tuck Jagadish First Look Released
నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ‌, షైన్‌స్క్రీన్స్ `ట‌క్ జ‌గ‌దీష్` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

26 December -2020
Hyderabad

There has been a lot of curiosity among the fans regarding the first look of Natural Star Nani in his upcoming film Tuck Jagadish. The film’s title poster showed Nani all tucked up in back pose without revealing his look.

Today, on the occasion of Christmas, much to the delight of fans and movie buffs, first look poster of the film is released. Nani appears in a class avatar in formal outfit, though his body language and actions are contrary to his appearance. He looks intense here holding a knife in his hand. We can see Nani’s class as well as mass acts in single picture which is a perfect treat for X Mas.

With the first look, the makers have also announced to release the film in April 2021.

This is second film together for Nani with director Shiva Nirvana after the blockbuster Ninnu Kori and the first look poster of Tuck Jagadish indicates it’s another fascinating film in their combination.

Ritu Varma and Aishwarya Rajesh are playing female lead roles in the movie.

The 26th film of Nani is produced jointly by Sahu Garapati and Harish Peddi under Shine Screens Banner.

Music sensation S Thaman scores music while Prasad Murella handles the cinematography.

Cast: Nani, Ritu Varma, Aishwarya Rajesh, Nasser, Daniel Balaji, Tiruveer, Rohini, Devadarsini, Praveen and others.

Crew:
Written& Directed by: Shiva Nirvana
Producers: Sahu Garapati and Harish Peddi
Music Director: S Thaman
Cinematography: Prasad Murella
Editor: Prawin Pudi
Art: Sahi Suresh
Fights: Venkat
Executive Producer: S.Venkatarathnam (Venkat)
Co-Director: Laxman Musuluri
PRO: Vamshi-Shekar
Publicity Designer: Siva Kiran (Working Title)
Costume Designer: Neeraja Kona

 

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ట‌క్ జ‌గ‌దీష్' ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచుస్తున్న విష‌యం తెలిసిందే.. టక్ జగదీష్' టైటిల్ పోస్టర్ లో టక్ చేసుకుని నిలబడిన నాని బ్యాక్ సైడ్ లుక్ ని చూపించిన మేకర్స్.. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా నాని అభిమానులు, సినీ ప్రేమికులకు ఆనందం కలిగించే విధంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నాని వడ్డించిన విస్తరి ముందు టక్ వేసుకుని కూర్చొని వెనుక నుంచి కత్తి తీస్తున్నట్లుగా చూపించారు. నాని పాత్రపై సస్పెన్స్‌ను పెంచే విధంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఇంటెన్స్ గా ఉన్న ఈ లుక్‌తో నాని అటు క్లాస్, ఇటు మాస్ ని చూపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. ఇది క్రిస్మ‌స్‌కు అభిమానుల‌కు సరైన ట్రీట్.

ఈ ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ఈ సినిమాను ఏప్రిల్ 2021లో విడుద‌ల చేయ‌నున్నట్లు తెలిపారు మేక‌ర్స్‌.

'నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో 'ట‌క్ జ‌గ‌దీష్‌'పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. వీరిద్ద‌రి కాంబోలో మరో సూపర్ హిట్ రాబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతోంది

ఈ సినిమాలో రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిని, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌న్ ముసులూరి,
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌,
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: శివ కిర‌ణ్‌(వ‌ర్కింగ్ టైటిల్‌)‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

 


 

 

   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved