pizza
Nee Kallu Neeli Samudram Song In Uppena Gets 100 Million Views
'ఉప్పెన‌'లోని 'నీ క‌న్ను నీలి స‌ముద్రం' సాంగ్‌కు 100 మిలియ‌న్ వ్యూస్‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

02 August -2020
Hyderabad


When everybody thought 50 million views was a great feat, Nee Kallu Neeli Samudram song has now attained an incredible accomplishment. The melodious romantic song from Uppena has breached 100 Million views. Coincidentally, the song reached the 100 Million mark on the special day of music director Devi Sri Prasad’s birthday.

DSP is popular for his mass beats. But, time and again, the ace composer has been continuing to prove that he is a master in composing melody songs. Nee Kallu song has been continuing to mesmerize music lovers for last few months and it helped a lot in hiking prospects on the film.

It’s Javed Ali’s vocals that makes the Qawwali song worth listening again and again. Vaisshnav Tej and Krithi Shetty made good impression on debut with their charismatic expressions. Lyrics for the song are penned by Shreemani and Raqueeb Alam.

Director Buchi Babu Sana is already talk of the town for his taste in music and also the way he presented the songs.

The other song Dhak Dhak Dhak got over 18 Million views so far.

Besides directing, Buchi Babu also penned story, screenplay and dialogues of the film bankrolled under Mythri Movie Makers in association with Sukumar Writings.

Tamil star Vijay Sethupathi plays a vital role in the film.

Uppena has completed all the works, including post-production and the film will release once things return to normal and theaters will reopen.

Cast: Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Kriti Shetty, Sai Chand, Brahmaji
Crew:
Story, Screenplay, Dialogues & Direction: Buchi Babu Sana
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Executive Producer: Anil Y & Ashok B
CEO: Cherry
Banner: Mythri Movie Makers, Sukumar Writings
Cinematography: Shamdat Sainudeen
Music director: Devi Sri Prasad
Editor: Naveen Nooli
Art Director: Mounika Ramakrishna
Pro: Vamsi Shekar, Madhu Maduri

 

50 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేయ‌డ‌మే గొప్ప విష‌యంగా అంద‌రూ భావిస్తుంటారు. అలాంటిది 'ఉప్పెన' చిత్రంలోని 'నీ క‌న్ను నీలి స‌ముద్రం' పాట న‌మ్మ‌శ‌క్యం కాని ఘ‌న‌త‌ను సాధించింది. ఈ శ్రావ్య‌మైన రొమాంటిక్ సాంగ్ 100 మిలియ‌న్ వ్యూస్ సాధించింది. సంద‌ర్భ‌వ‌శాత్తూ, ఇదే రోజు ఆ పాట‌కు బాణీలు కూర్చిన సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీప్ర‌సాద్ బ‌ర్త్‌డే కావ‌డం విశేషం.

డీఎస్పీ అంటే మాస్ బీట్స్‌కు పెట్టింది పేరు. కానీ విన‌సొంపైన బాణీలు కూర్చ‌డంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌ను మాస్ట‌ర్‌న‌ని ఆయ‌న నిరూపించుకుంటూనే ఉన్నారు. కొంత కాలంగా 'నీ క‌న్ను నీలి స‌ముద్రం' పాట సంగీత ప్రియుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తూ, 'ఉప్పెన' చిత్రంపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తోంది.

ఈ ఖ‌వ్వాలీ సాంగ్‌కు జావెద్ అలీ గానం తోడై మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేట్లు చేస్తోంది. అలాగే పాట‌లో హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతీ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్‌, వాళ్ల ఎక్సెప్రెష‌న్స్ ముచ్చ‌ట‌గా అనిపిస్తున్నాయి. ఈ పాట‌కు శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ చ‌క్క‌ని సాహిత్యం అందించారు.

డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాకు మ్యూజిక్‌పై ఉన్న అభిరుచి, పాట‌ల‌ను అత‌ను ప్రెజెంట్ చేసిన విధానం ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. మ‌రో పాట 'ధ‌క్ ధ‌క్ ధ‌క్' ఇప్ప‌టివ‌ర‌కూ 18 మిలియ‌న్ వ్యూస్ పైగా సాధించ‌డం గ‌మ‌నార్హం. ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు ఉప్పెన‌కు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను బుచ్చిబాబు అందించారు. సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర చేస్తున్న 'ఉప్పెన' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డి, థియేట‌ర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్న‌ద్ధంగా ఉన్నారు.

తారాగ‌ణం:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనికా రామ‌కృష్ణ‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.
సీఈవో: చెర్రీ
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌

 

 

 Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved