pizza
Suresh Kondeti acquired telugu rights of Ustad Hotel
You are at idlebrain.com > news today >
Follow Us

09 July 2015
Hyderabad

'ఉస్తాద్ హోటల్' రైట్స్ దక్కించుకున్న సురేష్ కొండేటి

ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, పిజ్జా.....ఇలా ఇప్పటివరకూ సురేష్ కొండేటి పదకొండు చిత్రాలు విడుదల చేస్తే.. అవన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించే నిర్మాతగా సురేష్ కొండేటి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన మరో సూపర్ డూపర్ హిట్ మూవీని ప్రేక్షకులకు అందించనున్నారు. ఆ సినిమా పేరు 'ఉస్తాద్ హోటల్'. మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ఇది. ఈ చిత్రం హక్కులను సురేష్ కొండేటి దక్కించుకున్నారు.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విమర్శకుల ప్రసశంసలు సైతం అందుకున్న చిత్రం ఇది.

ఈ చిత్రవిశేషాలను సురేష్ కొండేటి తెలియజేస్తూ - "ఇప్పటివరకూ దుల్కర్, నిత్యామీనన్ మూడు చిత్రాల్లో జంటగా నటించారు. 'ఉస్తాద్ హోటల్'. ఈ చిత్రంలో దుల్కర్, నిత్యా జోడీ బాగుందని ప్రేక్షకులు కితాబులిచ్చారు. ఆ తర్వాత చేసిన 'ఓకే బంగారం' ద్వారా హిట్ పెయిఅనిపించుకున్నారు. ఇక, ఇటీవల ఈ జంట నటించిన ఘనవిజయం సాధించింది. 'ఉస్తాద్ హోటల్' గురించి చెప్పాలంటే.. మూడు జాతీయ అవార్డులు గెల్చుకుంది. 'బెస్ట్ పాపులర్ మూవీ', 'బెస్ట్ డైలాగ్స్', నటుడు తిలకన్ కి ప్రత్యేక అవార్డు లభించాయి. అవార్డులు మాత్రమే కాదు.. భారీ వసూళ్లు సాధించి, మంచి కమర్షియల్ మూవీ అనిపించుకుంది. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రం హక్కులు దక్కినందుకు ఆనందంగా ఉంది. వచ్చే నెల ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్,


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved