pizza
The wedding ceremony song from Naga Shaurya and Ritu Varma’s ‘Varudu Kaavalenu' is released
నాగ శౌర్య , రీతువర్మ ల "వరుడు కావలెను" నుంచి విడుదల అయిన పెళ్ళి వేడుక గీతం
You are at idlebrain.com > news today >
Follow Us

02 October 2021
Hyderabad

Sithara Entertainments, a well-known film production company, is making a film 'Varudu Kavalenu' with young hero ‘Naga Shourya’ and heroine 'Ritu Varma' introducing 'Lakshmi Soujanya' as the director.

The ‘Varudu Kaavalenu’ unit released a sensational lyrical song from the movie today (2-10-2021).

This lyrical video song, when viewed, acts as a feast for the eyes. Going into further details..

The song that goes “Vaddanam chuttesi vacchaare bhamalu.. Vayyaram chindese andala bhamalu..”, are the lyrics that are penned down by Raghuram. The song was sung by singers Srikrishna, Geeta Madhuri, ML Gayatri, Aditi Bhavraju and Shruti Ranjani. The music for this song was composed by Vishal Chandrashekhar. This wedding ceremony song which is placed within the bounds of the story will include other main cast of the film alongside the hero-heroine, Naga Shaurya and Ritu Varma.

The song has beautiful music and good lyrics. In addition to these, Brinda masters dance choreography is even more uplifting.

Post-production of the film is currently underway. The film will be released on October 15 as a gift on the occasion of Dussehra.

Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.

Dialogues: Ganesh Kumar Ravuri,
Cinematographer: Vamsi Patchipulusu,
Music : Vishal Chandrashekhar
Editor: Navin Nooli
Art: A.S Prakash
PRO: Lakshmivenugopal
Presents by: P.D.V Prasad
Produced by: Surya Devara NagaVamsi
Story- Direction:Lakshmi Sowjanya

నాగ శౌర్య , రీతువర్మ ల "వరుడు కావలెను" నుంచి విడుదల అయిన పెళ్ళి వేడుక గీతం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘నేడు (2-10-2021) ‘వరుడు కావలెను‘ యూనిట్ చిత్రంలోని ఓ వీనుల విందైన గీతాన్ని విడుదల చేశారు.

ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే కన్నుల పండుగ గా అ(క)నిపిస్తుంది. వివరాల్లోకి వెళితే…‘‘ వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు ...వయ్యారం చిందేసే అందాల భామలు" అంటూ సాగే ఈ గీతం రచయిత రఘురామ్ రచిం చారు. ఈ గీతాన్ని గాయనీ, గాయకులు శ్రీకృష్ణ, గీతామాధురి, ఎం ఎల్ గాయత్రి, అదితి భావరాజు, శ్రుతి రంజని లు వీనుల విందుగా ఆలపించారు. ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన సంగీతం హుషారుగా సాగుతుంది. చిత్ర నాయకా నాయిక లు ‘నాగశౌర్య, రీతువర్మ‘ లతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్ర కథానుసారం ఓ పెళ్లి వేడుక నేపథ్యంలో తెర రూపంగా ఈ గీతం కనిపిస్తుంది. హుషారైన సంగీతం, చక్కని సాహిత్యం ఈ పాట సొంతం. వీటికి తోడు బృంద మాస్టర్ నృత్య రీతులు మరింత హుషారెత్తిస్తాయి.ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 15 న దసరా కానుకగా చిత్రం విడుదల.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశి
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved