pizza
VB Rajendra Prasad is no more
వీబీ రాజేంద్రప్రసాద్ ఇకలేరు
You are at idlebrain.com > news today >
Follow Us

12 January 2015
Hyderabad

Veteran film producer and director VB Rajendra Prasad (82) died in a private hospital in Hyderabad while getting treated. VB Rajendra Prasad is born in Gudiwada (Krishna district) and came to film industry to become an actor. He made his debut as producer with Annapurna film in 1960. He was confered with Raghupati Venkaiah award in recent years. His film Antastulu won national award as the best Telugu film. He became director with Dasara Bullodu which became a huge hit. He is the father of popular actor Jagapathi Babu. May his soul rest in peace!

ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత వీబీ రాజేంద్రప్రసాద్ సోమవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈషా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 82 ఏళ్లు. 1932 నవంబర్ 4న జన్మించారు. కాకినాడ పీ ఆర్ కళాశాలలో బీఎస్సీ చదివారు. రాఘవ కళా సమితి ద్వారా నాటకాలు ఎక్కువగా వేశారు. ఆత్రేయ రాసిన కప్పలు అనే నాటకంలో పంకజం అనే అమ్మాయిగా నటించారు. ఆయనకు నటనపై ఉన్న శ్రద్ధను గురించి ఇంట్లో చెప్పారు. వెంటనే ఆయన తండ్రి వీరమాచినేని జగపతి చౌదరి రూ.50 వేలను ఇచ్చి ప్రోత్సహించి మద్రాసుకు పంపారు. మద్రాసుకి నటుడవుదామని అడుగుపెట్టిన రాజేంద్రప్రసాద్ కు నిరాశ ఎదురైంది. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో నిర్మాతగా మారారు. జగపతి ఆర్ట్స్ సంస్థలో ఆయన తెరకెక్కించిన తొలి సినిమా అన్నపూర్ణ. ఆ సినిమా తర్వాత ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, అదృష్టవంతులు, అక్కాచెల్లెల్లు వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆ తర్వాత దసరా బుల్లోడు సినిమాతో దర్శకుడిగా మారారు. నాగార్జునతో తెరకెక్కించిన కెప్టెన్ నాగార్జున ఫ్లాప్ కావడంతో దర్శకత్వానికి దూరమయ్యారు. కానీ కొడుకు జగపతిబాబు తనకు నటించాలని ఉందని చెప్పడంతో సింహస్వప్నం చేశారు. ఆయన తెరకెక్కించిన అంతస్తులు సినిమాకు 1965లో ఫిల్మ్ ఫేర్, జాతీయ పురస్కారం అందాయి. 14 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2 సినిమాలకు రచయితగా పనిచేశారు. 2000లో కె.వి.రెడ్డి పురస్కారాన్ని, 2003లో రఘు పతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలో పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. జీవితం చరమాంకంలో పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారు. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీలో ఆయన 16 ఏళ్లు ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఫిల్మ్ నగర్ దైవసన్నిధానం అభివృద్ధికి ఆయన చాలా సేవ చేశారు. ఆయన ఇష్టదైవం ఏడుకొండలవాడు. 28 తెలుగు, 3 కన్నడ, 3 తమిళ్, 3 హిందీ సినిమాలను తెరకెక్కించారు. ‘‘జగపతి పిక్చర్స్ అని పెట్టి, దాన్ని ఆర్ట్స్ పిక్చర్స్ గా చేశాం. బ్యానర్ను మా నాన్నగారి పేరు మీద పెట్టాను. అంతేగానీ జగపతిబాబు పేరు మీద పెట్టలేదు’’ అని ఒకానొక సందర్భంలో చెప్పారు రాజేంద్రప్రసాద్.

‘‘ఆయన బతికినంత కాలం కింగ్ లాగా బతికారు. మా అమ్మాయికి, మా అన్నయ్యగారి అమ్మాయికి పెళ్లి కుదిరింది. అన్నీ మంచి వార్తలతోనే ఆయన సంతృప్తిగా చనిపోయారు. ఇంట్లోనే అన్ని పనులను పూర్తి చేస్తాం. చాంబర్ కి తీసుకెళ్లట్లేదు. నేను పెద్దగా సెటిల్ కాలేదని బాధపడ్డారు. కానీ చివరి కాలంలో నన్ను చూసి కూడా ఆనందించారు ’’ అని జగపతిబాబు చెప్పారు.

ఆయన చాలా సౌమ్యుడని మురళీమోహన్ అన్నారు.

పెద్ద మనిషి అనే పదానికి అర్థం చెప్పాల్సి వస్తే రాజేంద్రప్రసాద్ గారిని చూపించవచ్చని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.

రాజ్ నుంచి విడిపోయాక తనను కోఠిగా ప్రోత్సహించింది రాజేంద్రప్రసాద్ గారేనని కోఠి అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved