pizza
Veelaithe Premiddam release on 8 January
జనవరి 8న ‘వీలైతే ప్రేమిద్దాం’ విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

26 December 2015
Hyderabad

వైజాగ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నూతన నటీనటులతో విశాఖ థ్రిల్లర్‌ ‘వెంకట్‌’ దర్శకత్వంలో తేజ నిర్మిస్తోన్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ ప్రేమకథా చిత్రం ‘వీలైతే ప్రేమిద్దాం’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 8న విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వెంకట్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నాలుగు జంటల మధ్య నడిచే ప్రేమకథ. చక్కటి మెసేజ్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సకుటుంబ కథా చిత్రమిది. షకలక శంకర్‌ కామెడి ఈ చిత్రంలో చాలా బాగా పండింది. స్వర్గీయ ‘ఆకాష్‌’ అందించిన స్వరాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. నూతన సంవత్సర కానుకగా జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అన్నారు.

పృథ్వి, తులసి, రాజు, శివ, యాంజలీన, శ్రావ్య, చంద్రకళ, నవీన్‌, పూర్ణిమ, శివన్నారాయణ, షకలక శంకర్‌, జబర్ధస్ట్‌ శ్రీను, రాజా శ్రీధర్‌, ఎఫ్‌ఎమ్‌ బాబాయ్‌, గోపరాజు రమణలతో పాటు విశాఖ నగరానికి చెందిన స్థానిక కళాకారులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ పల్లా, సంగీతం: ఆకాష్‌(లేటు), ఎడిటింగ్‌: ఉపేంద్ర, డాన్స్‌: లుక్స్‌ రాజశేఖర్‌, శ్యామ్‌, ఆర్ట్‌: ఎస్‌. ఉత్తమకుమార్‌, ఛీప్‌ కో డైరెక్టర్‌: సురేష్‌. ఆర్‌, దర్శకత్వ పర్యవేక్షణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మూర్తి ఆడారి, సహనిర్మాత: బి. మంగమ్మ, ఎ. రామకృష్ణ, నిర్మాత: తేజ, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విశాఖ థ్రిల్లర్‌ ‘వెంకట్‌’.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved