pizza
Venkatesh and Maruthi's new film will launch on 16th December
విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, మారుతి కాంబినేష‌న్ లో డిసెంబ‌ర్ 16న
సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోడక్ష‌న్ నెం-2 చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

25 November 2015
Hyderabad

Venkatesh and Maruthi's new film will launch on 16th December

After grand success of Drushyam and Gopala Gopala, Victory Venkatesh is back again with the latest sensation Maruthi for his next outing. Venkatesh is teaming up with Nayanthara for the third time to relive the magic. Surydevara Naga Vamsi will be producing this family entertainer under Sithara entertainments banner and senior producer S.Radhakrishna (Chinababu) will be presenting this venture.

Movie is gonna be officially launched on the 16 December with a formal pooja and will start rolling on the same day. Music director Ghibran who has composed beautiful tunes for 'Run Raja Run', 'Jil' and recent release 'Cheekati Rajyam' will be doing music for this untitled film.

S. Vivek Anand will handling the camera and Uddav is roped in for editing. Producer Surya Devara Nagavamsi is aiming to release the film for 2016 summer.

Movie Title -
Presents: S.Radhakrishna (Chinababu)
Hero - Venkatesh
Heroine - Nayanatara
Music - Ghibran
Cinematography - S. Vivek Anand
Editing - Uddav
Producer - Surya Devara Nagavamsi
Director - Maruthi

విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, మారుతి కాంబినేష‌న్ లో డిసెంబ‌ర్ 16న
సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోడక్ష‌న్ నెం-2 చిత్రం ప్రారంభం

'దృశ్యం', 'గోపాల గోపాల' లాంటి వ‌రుస సూప‌ర్ హిట్ చిత్రాల త‌రువాత విక్ట‌రి వెంక‌టేష్ , వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సౌత్ఇండియ‌న్‌ క్వీన్ న‌య‌న‌తార జంట‌గా,' భ‌లేభ‌లేమ‌గాడివోయ్' చిత్రం తో డ‌బుల్ హ్య‌ట్రిక్ దిశ‌గా దూసుకుపోతున్న ట్రెండి ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో, ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్స‌ణ‌లో, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-2 గా నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశి నిర్మిస్తున్న చిత్రం డిసెంబ‌ర్ 16 న పూజాకార్య‌క్ర‌మాల‌తో రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రాంర‌భిస్తున్నారు. 'ర‌న్‌రాజార‌న్‌', 'జిల్‌', 'ఉత్త‌మ‌విల‌న్' లాంటి చిత్రాల‌కు అద్యుత‌మైన సంగీతాన్ని అందించిన జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. మా బ్యాన‌ర్‌ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న నెం2 గా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. 'లక్ష్మి',' తుల‌సి' చిత్రాలతో సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ గా టాలీవుడ్ లో రికార్డులు క్రియోట్ చేసిన విక్ట‌రి వెంక‌టేష్, న‌య‌న‌తార లు జంట గా న‌టిస్తున్నారు. రెండు వ‌రుస చిత్రాల‌తో వెంక‌టేష్ గారు, వ‌రుస విజ‌యాల‌తో న‌య‌న‌తార గారు క‌ల‌సి నటించ‌ట‌మే కాక 'భ‌లే భ‌లే మ‌గాడు' చిత్రం తో మారుతి యాడ్ అవ్వ‌టంతో ఈ ప్రోజెక్ట్ కి ప్రేక్ష‌కుల్లొ సూప‌ర్ పాజిటివ్‌ క్రేజ్ వ‌చ్చింది. ఇటీవ‌ల మారుతి చెప్పిన క‌థ మాకు న‌చ్చింది. వెంక‌టేష్ గారికి కూడా న‌చ్చ‌టంతో చిత్రాన్ని డిసెంబ‌ర్ 16న పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని అదేరోజు నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ని జ‌రుపుకుంటాం. వెంక‌టేష్ గారి చిత్రాల‌నుండి అలాగే మారుతి చిత్రాల నుండి ప్రేక్ష‌కులు ఆశించే ఫ్యామిలి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా వుంటుంది. త‌మిళంలో ఎన్నోభారీ చిత్రాల‌కు సంగీతాన్ని అందించి తెలుగులో 'ర‌న్‌రాజార‌న్‌', 'జిల్‌', లాంటి చార్ట్‌బ‌స్ట‌ర్స్ అందించిన జిబ్రాన్ ఈచిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.వివేక్ ఆనంద్ సినిమాటొగ్రాఫ‌ర్‌, ఉద్ద‌వ్‌. ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎటువంటి టైటిల్ అనుకోలేదు. త్వ‌ర‌లో మిగిలిన న‌టీన‌టుల వివ‌రాలు , సాంకేతిక నిపుణుల వివ‌రాలు తెలియ‌జేస్తాం. ఈ చిత్రాన్ని రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రిపి 2016 స‌మ్మ‌ర్ లో విడుద‌ల చేస్తాము.. అని అన్నారు

స‌మ‌ర్ప‌ణ‌: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు), సంగీతం:జిబ్రాన్‌, కెమెరా:ఎస్‌.వివేక్ ఆనంద్‌, ఎడిటింగ్: ఉద్దవ్‌, నిర్మాత: సూర్య‌దేవ‌ర నాగ‌వంశి, క‌థ‌,స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: మారుతి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved